Site icon HashtagU Telugu

Illuminating Paris Fashion Week : 3D లైట్స్ తో ‘వెరైటీ డ్రెస్’

Models Debut Bizarre Lamp D

Models Debut Bizarre Lamp D

రోజు రోజుకు టెక్నలాజి ఎంతగా పెరిగిపోతుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచం లో ఏంజరిగిన అది క్షణాల్లో మనకు తెలిసిపోతుంది. టెక్నలాజి ని ఉపయోగించి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు..అలాగే ఎన్నో వింతలు , ఆశ్చర్యపోయే వాటిని రూపొందిస్తున్నారు. తాజాగా ప్యారిస్ ఫ్యాషన్ వీక్ (Illuminating Paris Fashion Week) లో 3D లైట్స్ (3D Lit Dress) తో ‘వెరైటీ డ్రెస్’ రూపొందించి అక్కడి వారినే కాదు యావత్ ప్రజానీకాన్ని ఆశ్చర్యంలో పడేసారు.

ఫ్యాషన్ వీక్ అనగానే అందరికి పొట్టి పొట్టి డ్రెస్లలో అమ్మాయిలు కనిపిస్తారని..వారి అందంతో పాటు వారు వేసుకునే డ్రెస్ లతో కళ్లుతిప్పుకోకుండా చేస్తారని అంత మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం 3D లైట్స్ తో ‘వెరైటీ డ్రెస్’ రూపొందించి ఆశ్చర్యపరిచారు. అండర్‌కవర్ ద్వారా ‘డీప్ మిస్ట్’ సేకరణ 3D సాంకేతికతతో ఈ వినూత్న డ్రెస్ ను సిద్ధం చేసారు. ఈ డ్రెస్ అక్కడి వారిని కట్టిపడేసింది. ఈ డ్రెస్ పూలు, ఆకులతో రూపోందించారు. ఈ లైటింగ్ డ్రెస్ లో సీతాకోక చిలుకలను కూడా అమర్చారు. జున్ తకాషి (Jun Takahashi) అనే డిజైనర్ దీన్ని డిజైన్ చేశారు. ఈ డ్రెస్సు ఆ షోకే హైలెట్ గా నిలిచింది.