Site icon HashtagU Telugu

Rent Cars : కార్లను అద్దెకిస్తున్నారా..అయితే ఈ విషయం తప్పకతెలుసుకోండి !

GST Reduction

GST Reduction

అనంతపురం (Anantapur) జిల్లాలో కార్ల అద్దె పేరుతో నయా మోసం జోరుగా జరుగుతోంది. కార్లను అద్దె(Rent Cars)కు తీసుకుని అవే కార్లను తాకట్టు పెట్టి నగదు తీసుకుంటున్నారు కొంతమంది మోసగాళ్లు. కార్ల యజమానులు తొలుత కుటుంబ అవసరాలకోసం కార్ అవసరం అంటూ వస్తే, వారికి నమ్మకంగా ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ వంటి వివరాలు ఇచ్చి రెంట్ కు ఇస్తున్నారు. మొదట రెండు, మూడు రోజులు కారును ఉపయోగించి అద్దె కూడా రెగ్యులర్‌గా చెల్లించి, ఓ నమ్మకాన్ని కలిగిస్తున్నారు.

ఆ తర్వాత స్క్రిప్ట్ మారుతుంది. అవసరమైంది అంటూ కారును తాకట్టు పెడతారు. అంతే కాకుండా, ఆర్‌సీ కార్డు డౌన్లోడ్ చేసి ల్యామినేట్ చేసి చూపిస్తారు. రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకూ డబ్బు తీసుకుని, మళ్లీ అదే కారుతో మరొక చోటికి జంప్ అవుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రెండో కీ ఉపయోగించి కారును తీసుకెళ్లడం వల్ల జీపీఎస్ ఉన్నా గుర్తించలేని పరిస్థితి వస్తోంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేకపోవడంతో మోసగాళ్లు మరింత ఉత్సాహంగా దూకుడు చూపుతున్నారు.

ఈ మోసాలు రోజు రోజుకు ఎక్కువైపోతుండడం , పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడం కార్ల యజమానులను మరింత ఇబ్బందుల్లోకి వెళ్తున్నారు. అనంతపురం నగర శివారుల్లో దాదాపు పది మంది ఈ ముఠాలో ఉన్నట్లు తెలుస్తోంది. కాలం మారుతున్న కొద్దీ నేరగాళ్లు టెక్నాలజీని వాడుకుంటూ కొత్త మార్గాల్లో మోసాలు చేస్తున్న తీరుకు ఇది ఉదాహరణ. కార్లు అద్దెకు ఇవ్వాలనుకునే వారు సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవడం, కస్టమర్ వివరాలను నిష్కళంకంగా పరిశీలించడం అత్యవసరం.