Site icon HashtagU Telugu

Anand Mahindra: అలెక్సా ద్వారా కోతుల్ని తరిమిన అమ్మాయికి ఆనంద్ మహీంద్రా ఉద్యోగం ఆఫర్

Anand Mahindra

Anand Mahindra

Anand Mahindra: ఉత్తరప్రదేశ్‌లో సాంకేతిక పరిజ్ఞానంతో 13 ఏళ్ళ బాలిక తన చెల్లిని కోతుల దాడి నుంచి కాపాడింది. బస్తీలోని ఆవాస్ వికాస్ కాలనీలో 13 ఏళ్ల నికిత మరో 15నెలల తన చెల్లిని చాకచక్యంగా కాపాడింది. అలెక్సా ద్వారా కోతుల బెడద నుంచి సోదారిని కాపాడిన ఈ 13 ఏళ్ళ నికిత ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఆమె చేసిన పనికి మహేంద్ర సంస్థ అధినేత ఆనంద్ మహేంద్ర స్పందించడం ద్వారా ఈ వార్త మరింత హాట్ టాపిక్ గా మారింది. కోతుల దాడి నుంచి తనను, తన చెల్లెల్ని కాపాడిన సదరు బాలికకు ఆనంద్ మహీంద్రా శనివారం ఉద్యోగం ఆఫర్ చేశాడు.

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో నికిత ఇంట్లోకి కోతులు వచ్చి భయాందోళన సృష్టించగా . ఆ అమ్మాయి అలెక్సాను కుక్కలా మొరుగమని వాయిస్ ఓవర్ ఇచ్చింది. దీంతో అలెక్సా నుంచి కుక్క మొరిగిన సౌండ్ రావడంతో కోతులు అక్కడినుంచి పారిపోయాయి. దీంతో ఇంట్లో ఉన్న తన సోదరిని కాపాడింది. సదరు అమ్మాయి చేసిన ఈ పనికి ప్రతిఒక్కరు అభినందిస్తున్నారు. ఆ సమయంలో అలెక్సా ఆలోచన రావడం గొప్ప విషయమే.

We’re now on WhatsAppClick to Join

కోతుల దాడి నుంచి తనను, తన చెల్లెల్ని కాపాడిన నికితకి మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఉద్యోగం అఫర్ ఇచ్చాడు. అయితే తన చదువు పూర్తయిన తర్వాత తనకు ఉద్యోగం కావాలని కోరుకుంటే మహేంద్ర సంస్థలో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. సాహసోపేతమైన చర్యకు ఫిదా అయిన ఆనంద్ మహేంద్ర పొగడ్తలతో ముంచెత్తాడు. 13 ఏళ్ల బాలిక తన మనస్సును గెలిచింది అంటూ పోస్ట్ పెట్టాడు.

Also Read: Siddharth & Aditi Rao : ఎట్టకేలకు అదితిరావును పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సిద్దార్థ్