Site icon HashtagU Telugu

Chandrayaan Ganapathi : ‘చంద్రయాన్-3’ గణపతుల సందడి.. ఫొటోలు వైరల్

Chandrayaan Ganapathi

Chandrayaan Ganapathi

Chandrayaan Ganapathi : చంద్రయాన్ -3 మిషన్ లో భారత్ సాధించిన ఘన విజయాన్ని వినాయక చవితి వేళ దేశ ప్రజలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.  ఈక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వినాయక మండపాల్లో ‘చంద్రయాన్’ థీమ్ తో వినాయకుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కండేయ స్వామి దేవాలయంలో చేనేత కార్మికులు చంద్రయాన్ థీమ్ తో గణపతి మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ థీమ్ అందరినీ ఆకట్టుకుంటోంది.  చంద్రయాన్-3 ప్రయోగం గురించి సామాన్యులకూ అర్థం కావాలనే ఉద్దేశంతో ఈవిధంగా వినాయక మండపాన్ని ఏర్పాటు చేశామని మండపం నిర్వాహకులు తెలిపారు.

పైన ఉన్న ఫొటోను చూశారా ? దీన్ని ఆంధ్రప్రదేశ్ లోని  విజయవాడ పట్టణం వన్ టౌన్ పరిధిలోని ఒక చోట ఏర్పాటుచేసిన చంద్రయాన్-3 థీమ్ వినాయక మండపం.  సిటీలోని వస్త్రలత కాంప్లెక్స్, పాత శివాలయం దగ్గర్లోని ప్రాంతాల్లో ఈవిధమైన చంద్రయాన్ -3 థీమ్ వినాయక మండపాలు వెలిశాయి. రాకెట్ నింగిలోకి ఎగిరిన అనంతరం జాబిల్లిపై బొజ్జగణపయ్య దర్శనమిస్తారు. ఆ వెంటనే వినాయకుడి చుట్టూ విక్రమ్ ల్యాండర్ చక్కర్లు కొడుతున్నట్టుగా ఒక చోట అద్భుతమైన వినాయక మండపం కనువిందు చేస్తోంది. ఈ విగ్రహాల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో (Chandrayaan Ganapathi) వైరల్ అవుతున్నాయి.