ICE Apples : పెళ్లి రిసెప్షన్‌లో తాటి ముంజలు ..ఆశ్చర్యంలో అతిధులు

తాటి ముంజలను..ఓ పెళ్లి రిసెప్షన్‌లో ఏర్పాటు చేసి అతిధులను ఆశ్చర్య పరిచారు

Published By: HashtagU Telugu Desk
Ice Apples

Ice Apples

తాటి ముంజలు (ICE Apples)..వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఇవి ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటిని ‘ఐస్ యాపిల్’ అని కూడా అంటారు. ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి ముంజలు మార్కెట్లో మనకు దర్శనమిస్తాయి. ఈ మధ్య ఇవి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. పల్లెల్లో ఎక్కువగా లభిస్తున్న..సిటీ లలో మాత్రం చాల రేర్ గా కనిపిస్తున్నాయి. దీంతో అమ్మకం దారులు భారీ ధరకు వీటిని విక్రయిస్తున్నారు. ఎండాకాలంలో వీటిని తింటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని ఆరోగ్య నిపుణులు చెపుతుంటారు. అందుకే చాలామంది నగరవాసులు ఇవి ఎక్కడైనా కనిపిస్తే బాగుండు..ఎంత ధర పెట్టైనా తీసుకుంటాం అని మాట్లాడుకుంటుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాంటి ఈ తాటి ముంజలను..ఓ పెళ్లి రిసెప్షన్‌లో ఏర్పాటు చేసి అతిధులను ఆశ్చర్య పరిచారు. హైదరాబాద్ మన్నెగూడలోని ఒక కన్వెన్షన్ లో జరిగిన పెళ్లి రిసెప్షన్‌ వేడుకలో ఇలా అతిధుల కోసం ఏర్పాటు చేసారు. ఇది తెలిసి చాలామంది బంధువులు…వీటికోసం పోటీ పడ్డారు. ఎంతో ఇష్టంగా వాటిని తింటూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీడియో చూసిన ప్రతిఒక్క నెటిజన్ బాగుంది ఐడియా.. వాహ్.. సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also : Allari Naresh : రైటర్ గా మారిన అల్లరి నరేష్

  Last Updated: 23 Apr 2024, 12:53 PM IST