Hospital Airdrop : ఆకాశం నుంచి ఊడిపడిన హాస్పిటల్.. ఎలా ?

Hospital Airdrop : మనుషులను ఎయిర్ డ్రాప్ చేయడం గురించి మనం విన్నాం.

Published By: HashtagU Telugu Desk
Hospital Airdrop

Hospital Airdrop

Hospital Airdrop : మనుషులను ఎయిర్ డ్రాప్ చేయడం గురించి మనం విన్నాం. ఆహార పొట్లాలను ,నిత్యావసర సామగ్రిని, ఇతరత్రా సహాయక సామగ్రిని ఎయిర్ డ్రాప్ చేయడం గురించి మనకు తెలుసు. తాజాగా ఒక పోర్టబుల్ హాస్పిటల్‌ను మన దేశంలోని ఆగ్రాలో ఎయిర్ డ్రాప్ చేశారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  అత్యవసర వైద్య సేవల రంగం వికాసం దిశగా దీన్ని కీలక ముందడుగుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

భారత వైమానిక దళానికి చెందినన IAF C-130 విమానం దాదాపు 720 కిలోల బరువున్న పోర్టబుల్ ఆస్పత్రిని 1,500 అడుగుల ఎత్తు నుంచి ఆగ్రా శివార్లలో ఎయిర్ డ్రాప్(Hospital Airdrop) చేసింది.  ఇందుకోసం ఆగ్రాలోని ఎయిర్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన పారాచూట్‌లను ఉపయోగించారు. ఈ పారాచూట్లు హాస్పిటల్‌ను సురక్షితంగా భూమి ఉపరితలానికి చేర్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు అబ్బురపరిచేలా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో దేశంలో వినియోగించనున్న పోర్టబుల్  ఆస్పత్రుల సామర్థ్యాన్ని అంచనా వేయడం ఈ పరీక్షను నిర్వహించారు.  ప్రాజెక్ట్ భీష్మ్ (BHISHM)లో భాగంగా ఈ పోర్టబుల్ ఆస్పత్రిని కేంద్ర ప్రభుత్వం స్వదేశీ టెక్నాలజీతో తయారు చేయించింది.  ఈ బలమైన ఆస్పత్రిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ, డేటా అనలిటిక్స్‌ పరికరాలు కూడా ఉన్నాయి. అత్యవసర వైద్యసేవలు అందించేందుకు అవసరమైన అన్ని వైద్య ఉపకరణాలు ఇందులో సిద్ధంగా ఉంటాయి.

Also Read :Apple Vision Pro : యాపిల్ విజన్ ప్రో.. ఏమిటిది ? ధర ఎంత ? లాంచ్ ఎప్పుడు ?

ఈ పోర్టబుల్ హాస్పిటల్‌లో ఆపరేషన్ థియేటర్, ఎక్స్-రే యంత్రాలు, రక్త పరీక్ష పరికరాలు, వెంటిలేటర్లు కూడా ఉంటాయి. తుపాకీ గాయాలు, కాలిన గాయాలు, పగుళ్లు, అలాగే తీవ్రమైన రక్తస్రావం వంటి గాయాలకు చికిత్స చేయడానికి అవసరమైన వైద్య సదుపాయాలను ఇందులో ఉన్నాయి. ఈ హాస్పిటల్‌లోని ప్రతి యూనిట్‌లో కాంపాక్ట్ జనరేటర్, స్ట్రెచర్‌లు, మాడ్యులర్ మెడికల్ గేర్, మందులు, ఆహార సామాగ్రి ఉంటాయి. ఈ పోర్టబుల్ ఆస్పత్రి సౌరశక్తి, బ్యాటరీల ద్వారా విద్యుత్ వసతిని పొందుతుంది. ఒక పోర్టబుల్ ఆస్పత్రి తయారీకి దాదాపు రూ.1.50 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

Also Read :Who is Shooter : స్లొవేకియా ప్రధానిపై కాల్పులు.. 71 ఏళ్ల ముసలాయనే షూటర్

  Last Updated: 16 May 2024, 11:12 AM IST