Sara Tendulkar: నేను కూడా డీప్ ఫేక్ బాధితురాలినే: సారా టెండూల్కర్

టెక్నాలజీ అందిపుచ్చుకుని కొందరు కేటుగాళ్లు మహిళల ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఇటీవల రష్మిక వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది

Sara Tendulkar: టెక్నాలజీ అందిపుచ్చుకుని కొందరు కేటుగాళ్లు మహిళల ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఇటీవల రష్మిక వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో ప్రభుత్వం కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంది. అయితే తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా ఈ డీప్ ఫేక్ బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తన పేరిట కొందరు నకిలీ ఖాతాలు తెరిచారని ఆమె తెలిపారు.

సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్‌తో సన్నిహితంగా ఉన్న మార్ఫింగ్ ఫోటో వైరల్‌గా మారింది. సారా తన సోదరుడు అర్జున్ టెండూల్కర్‌తో ఉన్న ఫోటోను కొందరు పోకిరీలు నకిలీ చేశారు. అర్జున్ ముఖం స్థానంలో గిల్ ఫోటో జోడించి వైరల్ చేశారు. కాగా శుభ్‌మన్ గిల్, సారా టెండూల్కర్‌లు డేటింగ్‌లో ఉన్నారని గతంలో పుకార్లు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో డీప్ ఫేక్ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ సారా పోస్ట్ చేసింది. కొంతమంది టెక్నాలజీని దుర్వినియోగం చేయడం కలవరపెడుతుందని సారా టెండూల్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన డీప్ ఫేక్ ఫోటోలు కూడా చూశానని, కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే నకిలీ ఖాతాలు సృష్టించి నెటిజన్లను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read: Telangana: తెలంగాణను దోపిడీ చేసిన కేసీఆర్: రేవంత్