Site icon HashtagU Telugu

Hydroplaning : ఘోరమైన ప్రమాద వీడియో షేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..

hydroplaning during rainy season

hydroplaning during rainy season

వర్షం (Rains) పడుతున్నప్పుడు వాహనదారులు చాల జాగ్రత్తలు వహించాలి. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసినట్లే. రోడ్ల ఫై నీరు (Water) ఉన్నప్పుడు బైకులు స్పీడ్ గా వెళ్తే స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే రోడ్ల ఫై గుంతలు ఉన్నకాని వాహనాలు బోల్తా పడే ఛాన్సులు ఉంటాయి. అందుకే చాల జాగ్రత్తగా వాహనాలు నడపాలి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎక్కడిక్కడే రోడ్లన్నీ తెగిపోయాయి. ఎటు చూసిన నీరే కనిపిస్తుంది. ఈ క్రమంలో పోలీసులు వాహనదారులకు , ప్రజలకు పలు అలర్ట్ లు జారీ చేస్తున్నారు. వాగులు , నదులు దాటే ప్రయత్నం చేయకూడదని , ఓవర్ స్పీడ్ గా వెళ్లకూడదని , గుంతలు ఉన్న చోట చూసుకొని వెళ్లాలని సూచిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది ఇవేమి పట్టించుకోము అన్నట్లు వ్యవహరిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ లో ఓ ఆక్సిడెంట్ (Accident) తాలూకా వీడియో షేర్ చేసారు. ఈ వీడియో చూడటానికి చాలా భయంకరంగా ఉంది. రోడ్డుపై వర్షపు నీళ్లల్లో వెళుతున్న ఓ కారు అదుపుతప్పి గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదం సినిమాలోని యాక్షన్ సీన్ తరహాలో ఉంది. ఈ ఘోర ప్రమాదం ఎక్కడ జరిగిందనేది తెలియకపోయినప్పటికీ.. ఇందులో ఒక కారు రోడ్డుపై ప్రయాణిస్తుంది. రోడ్డుపై వర్షపు నీరు నిలిచి ఉన్న ఒక గుంతలోకి వెళ్లగానే కారు అదుపు తప్పింది. గాల్లోకి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లింది. ఈ వీడియోను షేర్ చేసిన సైబరాబాద్ పోలీసులు.. తడి రోడ్డపై కారులో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాహనదారులకు సూచించారు. తడి రోడ్లపై వెళ్లేటప్పుడు వేగాన్ని తగ్గించి పట్టును ఉంచాలని తెలిపారు. మైడ్రోప్లానింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Bull Climbed : రోడ్ల ఫై తిరగాల్సిన ఆంబోతు..బిల్డింగ్ పైకి ఎక్కింది ..ఎక్కడంటే..!