Site icon HashtagU Telugu

Kumai Aunty : భారీ ధర పెట్టి బంగారం కొంటున్న కుమారి ఆంటీ.. ఒక వీడియో జీవితం మార్చేసింది..

Kumai Aunty

Kumai Aunty

Kumai Aunty : సోషల్ మీడియా యూసేజ్ ఎక్కువ అయిన దగ్గర నుంచి ఎప్పుడు ఎవరు ఎందుకు ఫేమస్ అవుతున్నారో అనేది అసలు తెలియడం లేదు. ఒక చిన్న మాటతో, లేదా యాక్షన్‌తో వైరల్ అయ్యి.. ఓవర్ నైట్ లో సోషల్ మీడియా స్టార్స్ అయ్యిపోతున్నారు. ఇలా ఒక చిన్న మాటతో ఫేమస్ అయ్యిపోయిన మహిళ ‘కుమారి ఆంటీ. హైదరాబాద్ లో రోడ్డు సైడ్ చిరు వ్యాపారస్తురాలు అయిన ఈమె.. ఇప్పుడు తెలుగు ఎంటర్టైన్మెంట్ రంగానికి సెలబ్రిటీ అయ్యిపోయారు.

ఆంధ్రప్రదేశ్ గుడివాడకి చెందిన ఈ కుమారి ఆంటీ.. చదువులో ఏడో తరగతి ఫెయిల్ అయ్యారు. కానీ జీవితంలో మాత్రం బాగా సక్సెస్ అయ్యారు. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి మాదాపూర్ దుర్గంచెరువు వద్ద ఓ చిన్న ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేసి.. కస్టమర్స్ కి తక్కువ ధరలో రుచికరమైన భోజనం అందిస్తూ వచ్చారు. అలా ఒక చిరు వ్యాపారిగా కొనసాగుతున్న కుమారి ఆంటీ లైఫ్ ని ఒక చిన్న వీడియో మార్చేసింది.

‘రెండు లివర్లు ఎక్స్‌ట్రా. మీది మొత్తం వెయ్య అయ్యింది’ అనే డైలాగ్ సోషల్ మీడియా వైరల్ అయ్యి, కుమారి ఆంటీని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ చేసేసింది. ఆ తరువాత నుంచి కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాదు, సినీ సెలబ్రిటీస్ కూడా తమ సినిమా ప్రమోషన్స్ కోసం కుమారి ఆంటీ దగ్గరికి రావడం స్టార్ట్ చేసారు. ఆ తరువాత అక్కడ ట్రాఫిక్ ఇష్యూ అవ్వడం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కుమారి ఆంటీ గురించి మాట్లాడడంతో.. ఆమె మరింత ఫేమస్ అయ్యింది.

ఇక కుమారి ఆంటీకి వచ్చిన ఈ పాపులారిటీని తెలుగు టీవీ షోలు, సీరియల్స్ ఉపయోగించుకుంటూ వచ్చాయి. అలా కుమారి ఆంటీ జర్నీ.. రోడ్డు సైడ్ ఫుడ్ స్టాల్ నుంచి తెలుగు ఎంటర్టైన్మెంట్ రంగంలో గెస్ట్ హోదాకి చేరింది. ఇక పాపులారిటీతో కుమారి ఆంటీ కూడా బాగానే సంపాదించారు. దీంతో రీసెంట్ గా ఆమె భారీ ధర పెట్టి బంగారం కొనుక్కున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో కుమారి ఆంటీ.. ఆడవారికి బంగారం అనేది చాలా ఇష్టమంటూ చెప్పుకొచ్చారు.

Also read : Tillu Square : రెండేళ్ల క్రితం చెప్పిన మాటని సాధించిన సిద్ధూ.. అట్లుంటది టిల్లుతోని..