Husband Suicide : భార్యను పరాయి వ్యక్తితో ఆలా చూసి తట్టుకోలేక భర్త ఆత్మహత్య

Husband Suicide : మగన్ అనే వ్యక్తి, దివ్య అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే, ఆమె దీపక్ అనే పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది

Published By: HashtagU Telugu Desk
Hus Suc

Hus Suc

హర్యానాలోని రోహ్‌తక్‌లో ఓ భర్త తన భార్య చేసిన వైఖరిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మగన్ అనే వ్యక్తి, దివ్య అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే, ఆమె దీపక్ అనే పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం మగన్‌కి తెలిసి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. భార్య తరచూ ఓయో హోటల్స్‌లో ప్రియుడితో కలుస్తూ తన భర్తను మానసికంగా వేధించేది.

God father Malware : అకౌంట్లలో డబ్బులు ఖాళీ చేస్తున్న గాడ్ ఫాదర్ మాల్వేర్.. బీకేర్ ఫుల్!

ఒకరోజు దివ్య, తన ప్రియుడు దీపక్‌తో కలిసి ఓయో హోటల్‌కు వెళ్లింది. అక్కడ ఆమె డ్యాన్స్ చేస్తుండగా దీపక్ వీడియో తీశాడు. అదే వీడియోను దివ్య స్వయంగా తన భర్త మగన్‌కి పంపించింది. ఆ దృశ్యాన్ని చూసిన మగన్ తీవ్ర మనోవేదనతో కన్నీరు మున్నీరయ్యాడు. చివరికి జీవితాన్ని వీడి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసి, తన ఆత్మహత్యకు బాధ్యులెవరో పేర్కొన్నాడు.

మగన్ తీసిన సెల్ఫీ వీడియోలో తన భార్య దివ్య, ఆమె ప్రియుడు దీపక్ తమను మానసికంగా వేధించారని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. దివ్య డ్యాన్స్ వీడియోతో పాటు మగన్ సెల్ఫీ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత వారిపై కఠినమైన శిక్షలు విధించాలని, మహిళా నైతికతను ప్రశ్నిస్తూ చర్చించాల్సిన సమయం ఆసన్నమైందని కామెంట్లు చేస్తున్నారు.

  Last Updated: 25 Jun 2025, 09:52 PM IST