డిజిటల్ యుగంలో టెక్నాలజీ విస్తరించిన కొద్దీ మహిళల గోప్యత, భద్రతకు సవాళ్లు మరింత పెరుగుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. సుమారు 32,000 మంది భర్తలు తమ భార్యల అనుమతి లేకుండా వ్యక్తిగత చిత్రాలను, ముఖ్యంగా స్నానం చేస్తున్నప్పుడు లేదా బట్టలు మార్చుకునే సమయంలో తీసిన ఫోటోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తూ పట్టుబడ్డారు. డబ్బు సంపాదనే ఉద్దేశంతో కొందరు భర్తలు డార్క్ వెబ్ లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ఫొటోలు విక్రయించడం మహిళల భద్రతపై ఆందోళనలను రేకెత్తిస్తోంది. భర్తలపైనే నమ్మకం ఉంచే మహిళలకు ఇదొక ద్రోహంగా మారింది.
Amaravati : ఫ్యూచర్ సిటీ టూ అమరావతి 211 కి.మీ..రూ.10 వేల కోట్ల అంచనా !!
ఇలాంటి చర్యలను భారతదేశంలో చట్టపరంగా తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నారు. ఐటీ చట్టం 2000 ప్రకారం బాధ్యులైన వ్యక్తులకు కఠిన శిక్షలు, జరిమానాలు విధించే అవకాశం ఉంది. సైబర్ క్రైమ్ విభాగాలు ఈ కేసులను ప్రాధాన్యతతో విచారిస్తూ, సోషల్ మీడియా సంస్థలతో కలిసి ఆ ఫొటోలు, వీడియోలను తొలగించే చర్యలు చేపడుతున్నారు. బాధిత మహిళలకు న్యాయం అందించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలు పనిచేస్తున్నాయి. పోలీసులు మహిళలకు సూచన చేస్తూ ఎవరు అయినా, భర్తలే అయినా, వ్యక్తిగత చిత్రాలను తీయడానికి అనుమతించకూడదని హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్యను ఎదుర్కోవడానికి సమాజం, చట్ట అమలు సంస్థలు, సాంకేతిక సంస్థలు కలిసి ముందుకు రావాలి. గూగుల్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు అధునాతన ఆల్గారిథమ్‌లతో ఇలాంటి కంటెంట్‌ను తొలగిస్తున్నప్పటికీ, మరింత బలమైన చర్యలు అవసరం. మహిళలు తమ హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలి, బలమైన పాస్‌వర్డ్‌లు, 2-స్టెప్ వెరిఫికేషన్ వంటివి ఉపయోగించి తమ అకౌంట్లను రక్షించుకోవాలి. అప్రమత్తతతో, చట్టపరమైన సహాయం తీసుకుంటూ, సమాజం కలిసికట్టుగా నిలిచినప్పుడే ఇలాంటి డిజిటల్ నేరాలను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.