Viral : ప్రియుడితో రొమాన్స్ లో ఉండగా భర్త ఎంట్రీ..ఆ తర్వాత ఆమె ఏంచేసిందంటే !!

Viral : హోటల్ బాల్కనీ నుంచి పక్క ఇళ్లపైకి దూకి అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటన అక్కడ చూసిన వారిని షాక్‌కు గురి చేసింది

Published By: HashtagU Telugu Desk
Woman Hotel

Woman Hotel

ఉత్తరప్రదేశ్‌(UttarPradesh)లోని బాగ్‌పత్ జిల్లాలో ఒక వివాహిత వివాహేతర సంబంధం (Illegal Affair) కేసు స్థానికంగా సంచలనం రేపింది. 2019లో వివాహమైన ఆ మహిళకు ఓ కుమారుడు ఉన్నాడు. అయితే గత మూడేళ్లుగా భర్త(Husband)తో విభేదాలు కొనసాగుతుండటంతో ఆమె శోభిత్ (Shobith ) అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండా తరచూ అతడిని కలుసుకుంటూ వస్తుంది. ఈ విషయం భర్తకు తెలియడం తో పలుమార్లు హెచ్చరించినా ఆమె తన తీరును మార్చుకోలేదు.

Mahesh Babu : పాపం మహేష్ కు ఆ ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు రాజమౌళి..!!

తాజాగా ఆమె శోభిత్‌ను కలిసేందుకు బడౌత్ పట్టణంలోని ఓ హోటల్‌కు వెళ్లింది. భర్త ముందస్తుగా సమాచారాన్ని తెలుసుకొని, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులు, భర్త కలిసి ఆ హోటల్‌కు వెళ్లారు. వారిని గమనించిన మహిళ హోటల్ బాల్కనీ నుంచి పక్క ఇళ్లపైకి దూకి అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటన అక్కడ చూసిన వారిని షాక్‌కు గురి చేసింది.

మహిళ పారిపోవడంతో పోలీసులు హోటల్‌లో ఉన్న శోభిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిని వివాహేతర సంబంధం విషయమై విచారిస్తున్నారు. ఈక్రమంలో మహిళ హోటల్ నుంచి దూకి పారిపోతుండటాన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఈ వీడియో వైరల్ అయింది. ఇప్పుడీ ఘటనపై స్థానికులు పెద్దఎత్తున చర్చిస్తున్నారు. ఈ వ్యవహారం కుటుంబ సంబంధాలపై తలెత్తుతున్న నైతిక ప్రశ్నలకూ నిదర్శనంగా మారుతోంది.

  Last Updated: 19 Jun 2025, 09:32 AM IST