Site icon HashtagU Telugu

Bat: వామ్మో.. మనిషి సైజులో వేలాడుతున్న గబ్బిలం.. నెట్టింట ఫొటోస్ వైరల్?

Bat

Bat

గబ్బిలాల గురించి మనందరికీ తెలిసిందే. ఇవి చెట్లపై పాడుబడిన బంగాళాల్లో తలకిందులుగా వేలాడుతూ ఉంటాయి. అయితే మామూలుగా గబ్బిలాలు మన రెండు అరచేతుల అంత ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొన్ని కొంచెం పెద్దగా ఉంటాయి. కానీ ఎప్పుడైనా మనిషి సైజులో ఉండే గబ్బిలాన్ని చూశారా. వినడానికి కాస్త భయంకరంగా ఉన్న ఇది నిజం. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ గబ్బిలాన్ని చూసిన నెటిజెన్స్ భయభ్రాంతులకు గురవుతున్నారు.

మనిషి సైజులో ఉన్న ఈ గబ్బిలం ఇంటి చూరుకు వేలాడుతూ భయపెడుతోంది. గబ్బిలాలను పిశాచాలతో పోలుస్తుంటారు. కొన్ని జాతులకు చెందిన గబ్బిలాలు ఇతర జంతువుల రక్తం తాగుతాయి. అయితే ఈ ఫొటోను చూసి ఎవరూ భయపడనక్కరలేదు. ఎందుకుంటే ఎవరో గబ్బిలం తరహా వేషధారణతో జనాలను భయపెట్టేందుకు ఇలా తలకిందులుగా వేలాడుతున్నారని కొందరు అంటున్నారు. అయితే ఇది ఎంత సహజంగా ఉందంటే నిజమైన గబ్బలం వేలాడుతున్నదని ఈ ఫొటో చూసినవారంతా హడలెత్తిపోతున్నారు. అయితే అసలు విషయం తెలిశాక అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.

 

అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ ఉంది. ఫొటోలో గబ్బిలం రూపం అంత పెద్దగా కనిపించడానికి కెమెరా ట్రిక్‌ కారణమట. ఆప్టికల్‌ ఇల్యూజన్‌ సృష్టించారట. ఒక సాధారణ గబ్బిలం ఫొటోను పెద్దదిగా చేసి చూపారుట. ట్విట్టర్‌లోని ఈ ఫొటో అందరి దృష్టిని ఇట్టే ఆకర్షిస్తోంది. మొదట మనిషి సైజులో ఉన్న ఆ గబ్బిలాన్ని చూసి భయపడిన చాలామంది ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఆ గబ్బిలానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ నిజంగానే అంత పెద్ద గబ్బిలం ఉంటే పరిస్థితులు ఏంటి అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.