Site icon HashtagU Telugu

Finger in Ice Cream: ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు.. విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Finger In Ice Cream

Finger In Ice Cream

Finger in Ice Cream: కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో ఆసక్తికర సంఘటన వెలుగు చూసింది. మలాడ్‌కు చెందిన ఓ వైద్యుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆహార పదార్థాలు మరియు వాటి స్వచ్ఛత గురించి సోషల్ మీడియాలో ప్రశ్నలు తలెత్తాయి. అదే సమయంలో ముంబై పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో పోలీసులకు క్లూ లభించడంతో ఈ వేలు ఐస్‌క్రీమ్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగిది అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.ఈ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వేలు ఎవరిదనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం పోలీసులకు కూడా సవాలుగా మారింది. అయితే ఇప్పుడు ఈ కేసులో లేవనెత్తిన పెద్ద ప్రశ్నను పోలీసులు బయటపెట్టారు.

యుమ్మో ఐస్‌క్రీమ్‌కు చెందిన పూణే ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగి ఈ ప్రమాదంలో వేలికి గాయమైనట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజునే ఐస్‌క్రీమ్‌లో వేలి ముక్క దొరికినట్లు విచారణలో తేలిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. డీఎన్‌ఏ పరీక్షకు శాంపిల్స్‌ పంపిన పోలీసులు.. రిపోర్టు వచ్చిన తర్వాత ఆ వేలు ఉద్యోగిదేనా కాదా అనేది నిర్ధారిస్తారు. ఆహార భద్రతా ప్రమాణాలపై తీవ్ర ఆందోళనలు రేకెత్తించిన సంఘటనలో ముంబైకి చెందిన 26 ఏళ్ల డాక్టర్ ఓర్లెమ్ బ్రాండన్ సెర్రావ్ తన సోదరి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో వేలును గుర్తించారు. డాక్టర్ సెర్రావ్ ఐస్ క్రీమ్ ని గం తిన్న తర్వాత నోటిలో గట్టి ముక్క ఉన్నట్లు అనిపించిందని, అయితే ఏదైనా గింజ అయి ఉండొచ్చని బయటకు తీయడంతో వేలు చూసి ఖంగు తిన్నాడట సదరు డాక్టర్.

డాక్టర్ మాట్లాడుతూ..నేను డాక్టర్ని కాబట్టి శరీర భాగాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. నేను దానిని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు దాని క్రింద వేలిగోళ్లు మరియు వేలిముద్రలు కనిపించాయి. బొటనవేలులా కనిపించింది. నేను షాక్‌లో ఉన్నాను అని చెప్పాడు. ఏదేమైనప్పటికే ఈ నిర్లక్ష్యం క్షమించరానిది. మరి ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. చూడాలి మరి చివరికి నిందితులకు శిక్ష పడుతుందో లేదో.

Also Read: Pawan First Signature : డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ రెండు కీలక ఫైల్స్ ఫై సంతకం..