Alien Fever : మూడు వేళ్లు, పొడవాటి తలతో వింత జీవులు

Alien Fever : అవి ఏలియన్సా ? మమ్మీలా ? అనేది ఇప్పటివరకు తేలలేదు. చూడటానికి ఈజిప్టు మమ్మీలలా ఉన్నాయి.

  • Written By:
  • Updated On - April 7, 2024 / 12:40 PM IST

Alien Fever : అవి ఏలియన్సా ? మమ్మీలా ? అనేది ఇప్పటివరకు తేలలేదు. చూడటానికి ఈజిప్టు మమ్మీలలా ఉన్నాయి. కానీ అవి మమ్మీలు కాదని కొందరు సైంటిస్టులు అంటున్నారు.  అవి ప్రాచీన శిల్ప కళాఖండాలు మాత్రమేనని, సాధారణ బొమ్మలను మమ్మీలుగా ఎలా పరిగణిస్తామని మరికొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. పెరూ దేశంలోని నాజ్కా ప్రాంతంలో ఉన్న కొన్ని పొలాల్లో బయల్పడిన కళాఖండాల శిలాజాలపై ఈవిధమైన చర్చ నడుస్తోంది. మనిషి తరహా శరీరంలో  పొడవాటి తలలు, చేతికి మూడే వేళ్లతో ఉన్న ఈ విచిత్రమైన కళాఖండాలపై ఇప్పుడు వాడివేడి విశ్లేషణలు వెలువడుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

2017లో  నాజ్కా ప్రాంతంలోని కొన్ని పొలాల్లో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపగా..  పొడవాటి పుర్రెలు, మూడే వేళ్లు కలిగిన చేతుల శిలాజాలు లభించాయి. వీటన్నింటిని తీసుకొచ్చి జాయింట్ చేసి చూడగా.. అచ్చం మనం ఊహించుకునే ఏలియన్స్ తరహా రూపం వచ్చింది. దీన్ని చూసి శాస్త్రవేత్తలు అప్పట్లో ఆశ్చర్యపోయారు. అవి నిజంగానే ఏలియన్స్(Alien Fever) శరీరాలా ? అనే సందేహం ఆనాడు తలెత్తింది.

Also Read :TTD: ఏప్రిల్ 9న తిరుమలలో ఉగాది ఆస్థానం, పలు పూజ కార్యక్రమాలు రద్దు

దీంతో  మానవ ఆకారంలోని ఆయా  శిల్ప  కళాఖండాల భాగాలలో ఏయే పదార్థాలు ఉన్నాయి అనేది తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణులు ప్రయత్నించారు. మనిషి, జంతువుల ఎముకలను కాగితం, సింథటిక్ జిగురు, మెటల్‌లతో కలిపి ఏలియన్స్‌ను తలపించే ఈ బొమ్మలను వేల ఏళ్ల క్రితం తయారు చేయించారని ఈ ఏడాది జనవరిలో వెల్లడైంది. అంటే ఇవి ముమ్మాటికీ బొమ్మలే అని విషయం స్పష్టమైంది. అవి ఇతర గ్రహాల నుంచి వచ్చిన జీవుల శరీరాలు కాదని తేలిపోయింది. అయితే ఈవిషయంపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తాజాగా వీటిపై అధ్యయనం బాధ్యతలను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తల టీమ్‌కు అప్పగించారు. ఈ బృందంలో సైంటిస్టులు  డాక్టర్ జేమ్స్ కరుసో, డాక్టర్ విలియం రోడ్రిగ్జ్, డాక్టర్ జాన్ మెక్‌డోవెల్ ఉన్నారు. ప్రస్తుతానికి అవి బొమ్మలే అని చెప్పలేమని, తమ అధ్యయనం తర్వాతే అసలు విషయం బయటికొస్తుందని అమెరికా సైంటిస్టులు అంటున్నారు. వారి అధ్యయనంలో ఏం బయపడుతుందో వేచిచూడాలి.

Also Read : BRS Boss : గులాబీ బాస్ ప్రెస్‌మీట్‌పై తీవ్ర ఉత్కంఠ.. ఏం చెప్పబోతున్నారు ?