Earthquake Videos : జపాన్ భూకంపం.. టాప్ – 5 వైరల్ వీడియోస్ ఇవే..

Earthquake Videos : న్యూ ఇయర్‌లో మొదటి రోజున(సోమవారం) జపాన్‌ను భారీ భూకంపం వణికించింది.

  • Written By:
  • Updated On - January 2, 2024 / 10:30 AM IST

Earthquake Videos : న్యూ ఇయర్‌లో మొదటి రోజున(సోమవారం) జపాన్‌ను భారీ భూకంపం వణికించింది. ఈ భూకంపంలో 24 మంది చనిపోగా, వందలాది మందికి గాయాలయ్యాయి. ప్రాణనష్టం ఇంకా ఎక్కువగానే ఉంటుందని, గణాంకాలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఆస్తినష్టం కూడా భారీగా జరిగింది. ఎన్నో ఇళ్లు, ఫ్యాక్టరీలు దెబ్బతిన్నాయి. కొన్ని కూలిపోయాయి. సముద్ర తీర ప్రాంతాలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మనం ఇప్పుడు చూద్దాం..

సోమవారం ఒక్కరోజే జపాన్‌లోని వివిధ ప్రాంతాల్లో 155 భూకంపాలు వచ్చాయి. మంగళవారం తెల్లవారుజామున కూడా కొన్ని ప్రాంతాల్లో ఆరు భూకంపాలు చోటు చేసుకున్నాయి. భారీ సునామీ రావచ్చని అంచనా వేసినప్పటికీ అలా జరగకపోవడంతో జపాన్ సముద్ర తీర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

సోమవారం సంభవించిన భూకంపాలలో భారీ భూకంపం జపాన్‌లోని నార్త్ సెంట్రల్ జపాన్‌లో వచ్చింది. ఇషివాకా, నీగాటా, టొయామా తీర ప్రాంత నగరాలపై సునామీ అలల ప్రభావం కూడా కనిపించింది. భూకంపంతో రోడ్లు బీటలు వారాయి.

జపాన్ చుట్టూ సముద్రం ఉంది. భూమిలోని పలకలు నిరంతరం పశ్చిమం వైపు కదులుతూనే ఉన్నాయి. దీంతో ఇక్కడ భూకంపం సంభవించినప్పుడు .. భూమిలోని పలకల కదలిక వల్ల సునానీ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. భూకంపం ధాటికి భూమి బీటలు బారిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

చివరగా 2011 సంవత్సరంలో జపాన్‌లో రిక్టర్ స్కేలుపై 9 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ రెండూ ఏకకాలంలో వచ్చాయి.  అప్పుడు 18,500 మంది చనిపోయారు. 2022లో 7.4 తీవ్రతతో వచ్చిన భూకంపంలో తూర్పు జపాన్ వణికిపోగా, ముగ్గురు చనిపోయారు.జపాన్ చాలా చిన్న దేశం. ఇది మన తెలుగు రాష్టాల కంటే కాస్త పెద్దగా ఉంటుంది. భూమి తక్కువ, జనాభా ఎక్కువ. 100 ఏళ్లు దాటిన ముసలివారు ఇక్కడ ఎక్కువ.