Site icon HashtagU Telugu

Domino Tower Falls : కూలిపోవడం ఇంత అందంగా ఉంటుందా.. గిన్నిస్ రికార్ డొమినో టవర్ కూల్చివేత..

How Falls Domino Tower Guinness Record Shares viral Video

How Falls Domino Tower Guinness Record Shares viral Video

ఒకేరకమైన చెక్క ముక్కలతో చేసిన ఓ ఎత్తైన టవర్ కూలిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్న చిన్న చెక్కలతో కట్టిన ఈ బిల్డింగ్ లో ఒక్క చెక్క ముక్క కదిపితే మొత్తం కూలిపోయింది. ఇలా చైన్ రియాక్షన్ జరగడాన్ని డొమినో ఎఫెక్ట్‌ లేదా మెకానికల్ ఎఫెక్ట్ అని అంటారు. చూడటానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ వీడియోని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తన ట్విట్టర్‌లో షేర్ చేసింది.

ఒలింపియా లండన్ (UK) లో 27.46 మీటర్ల ఎత్తులో చెక్క దిమ్మల వంటి బ్లాక్స్ తో ఓ ఎత్తైన డొమినో టవర్‌(Domino Tower)ను బెంజమిన్ క్రౌజియర్ టీం క్రియేట్ చేశారు.

దానితో ఓ రికార్డ్ సృష్టించగా ఇప్పుడు ఆ టవర్ ను కూల్చేశారు. తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టవర్ కూల్చివేత చాలా సంతృప్తికరంగా ఉంది అంటూ ఆ వీడియో ను పోస్ట్ చేశారు. వీడియో ప్లే చెయ్యగానే చెక్క దిమ్మలతో నిర్మించిన ఒక ఎత్తైన నిర్మాణం కనపడుతుంది. దానిని కూల్చడానికే కౌంట్‌డౌన్ మొదలు పెట్టారు. కౌంట్‌డౌన్ ముగిసిపోగానే ఒక యువతి టవర్ కింద ఒక చెక్కను కదల్చగా కేవలం సెకన్లలోనే టవర్ డొమినో కూలిపోతుంది.

ఈ వీడియోను చూసిన చాలామంది నెటిజన్లు తమ కామెంట్స్ ను పోస్ట్ చేస్తున్నారు. అద్భుతం, అందం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఒక వ్యక్తి మాత్రం వస్తువులను నిర్మించడానికి చాలా రోజులు పడుతుంది, కానీ దానిని నాశనం చేయడానికి సెకన్లు పడుతుంది అని రాసుకొచ్చాడు. నిజమే కదా..

 

Also Read : video viral: వరద నీటిలోనే పెళ్లి చేసుకున్న జంట.. వీడియో వైరల్?