Longest Mustache : 24 అంగుళాల మీసాల వెనుక.. ఇంట్రెస్టింగ్ స్టోరీ!

Longest Mustache : ఆయన మీసాల పొడవు 24 అంగుళాలు. గత 35 ఏళ్లుగా కట్ చేయకుండా అల్లారుముద్దుగా పెంచిన మీసాలవి.

Published By: HashtagU Telugu Desk
Longest Mustache

Longest Mustache

Longest Mustache : ఆయన మీసాల పొడవు 24 అంగుళాలు. గత 35 ఏళ్లుగా కట్ చేయకుండా అల్లారుముద్దుగా పెంచిన మీసాలవి. ఈవిధంగా మీసాలను పెంచి ఎంతో ఫేమస్ అయ్యారు ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లా రత్ తహసీల్‌లోని బరువా గ్రామానికి చెందిన 64 ఏళ్ల బాల్‌కిషన్ రాజ్‌పుత్. ఆయన మీసాలు బాగా పెరిగిపోవడంతో.. వాటిని మడతపెట్టి దారంతో ముడి వేస్తున్నారు.  స్నానం చేసేటప్పుడు మాత్రమే ఆ ముడిని విప్పుతున్నారు. బాల్‌కిషన్ రాజ్‌పుత్ ఒక రైతు. అతడికి భార్య, తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారు. అందరిలాగే కుటుంబ జీవితం గడిపే బాల్‌కిషన్ మీసాలు(Longest Mustache) ఇంతలా పెంచడం వెనుక పెద్ద కథే ఉంది.

We’re now on WhatsApp. Click to Join

  • 1991 సంవత్సరంలో ఓ రోజు పోలీసులు బాల్  కిషన్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. లాకప్‌లో పడేశారు.
  • ఆ తర్వాత మీసాలున్న చాలామందిని తీసుకొచ్చి అదే లాకప్‌లోకి నెట్టారు.
  • లాకప్‌లోకి వచ్చిన ఓ వ్యక్తికి 24 అంగుళాల మీసాలు ఉన్నాయి.
  • ఆ టైంలో బాల్  కిషన్‌ మీసాల పొడవు 8 అంగుళాలే.
  • ఆ తర్వాత లాకప్‌లోకి వచ్చిన మున్సిఫ్ మెజిస్ట్రేట్.. మీసాలున్న వాళ్లందరినీ చెక్ చేస్తూ .. బాల్ కిషన్‌కు తక్కువ  మీసాలు ఉన్నాయంటూ చులకనగా మాట్లాడారు.
  • బాల్ కిషన్‌ను పక్కను నెట్టాలని పోలీసు సిబ్బందిని మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఆనాడు ఆదేశించారు.
  • దీన్ని పెద్ద అవమానంగా భావించిన బాల్ కిషన్.. తన మీసాలను అత్యంత పొడవుగా పెంచాలని ఆనాడే  నిర్ణయించుకున్నారు.
  • పూలన్ దేవి ముఠాకు చెందిన గజదొంగ లఖన్ సింగ్‌ను గుర్తించేందుకే ఇంతలా పోలీసులు హైరానా పడ్డారని ఆ తర్వాత బాల్ కిషన్‌కు తెలిసొచ్చింది.
  • లాకప్‌లోకి 24 అంగుళాల మీసాలతో వచ్చిన వ్యక్తే గజదొంగ లఖన్ సింగ్ అని ఆ తర్వాత తెలియడంతో బాల్ కిషన్ ఆశ్చర్యపోయాడు.
  • తన మీసాలను కూడా అతడిలా పెంచాలని బాల్ కిషన్ డిసైడయ్యాడు.

Also Read :Raghuramakrishna Raju : రఘురామకు ఆ పార్టీ నుంచి అసెంబ్లీ టికెట్ !

  • గత 33 ఏళ్లుగా బాల్ కిషన్ ప్రేమగా మీసాలను పెంచాడు.
  • చివరకు తన తండ్రి చనిపోయినప్పుడు కూడా మీసాలను కట్ చేయలేదు. వాటి సైజును తగ్గించి వదిలేశాడు.
  • మీసాల పొడవు వల్ల చాలాచోట్ల బాల్ కిషన్‌కు సన్మానాలు, సత్కారాలు జరిగాయి.
  • ఇకపైనా తన మీసాలను ఇలాగే పెంచుతానని బాల్ కిషన్ అంటున్నారు.

Also Read :Billionaire To Zero : బిలియనీర్ జీరో అయ్యాడు.. బైజూస్ అధినేత నెట్ వర్త్ ‘జీరో’ !

  Last Updated: 04 Apr 2024, 01:40 PM IST