Site icon HashtagU Telugu

Divorce : పడక గదికి నా మొగుడు పనికిరాడు అంటూ విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన భార్య..భారీ ట్విస్ట్ ఇచ్చిన భర్త

Husband Wife

Husband Wife

హైదరాబాద్‌లో నివసించే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జీవిత కథ ప్రేమకథగా మొదలై, న్యాయసభలో ముగిసిన జీవితం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 38 ఏళ్ల వయసున్న ఆమె, ఒక ప్రముఖ ఐటీ సంస్థలో సీనియర్ స్థాయి ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమెకు 33 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగిని వరుడిగా చూసారు. చదువూ, ఉద్యోగం, కుటుంబ నేపథ్యం అన్నీ చూసి ఇద్దరికి పెళ్లి సంబంధం ‘పర్ఫెక్ట్ మ్యాచు’గా పరిగణించారు. పెళ్లి అనంతరం అమెరికా వెళ్లి ఇద్దరూ కలిసి రెండేళ్ల పాటు జీవించారు. మొదటినుంచి కలల బంధంగా అనిపించిన ఈ సంబంధం ఆ తరువాత అనుమానాల అగ్నిపరీక్షలో చిక్కుకుంది.

భర్త శారీరకంగా బలహీనుడని ఆరోపిస్తూ, ఆమె మొదట ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. పెళ్లికి ముందు అతను ఈ విషయం దాచాడని, తాము పూర్తిగా దాంపత్య బంధం పంచుకోలేకపోయామని ఆమె వాదించింది. ఆమె రూ. 90 లక్షల అలిమనీ (పర్తివ సహాయం) కూడా కోరింది. కానీ కోర్టు ఆమె ఆరోపణలను నమ్మక పోయింది. ఆధారాల లేమితో ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది. అప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదు. ఈ కేసును హైకోర్టుకు తీసుకెళ్లింది.

Pain in the Ankle : మీ అరిపాదంలో ఉన్నట్టుండి నొప్పి లేదా మంటగా అనిపిస్తుందా? ఇది దేనికి సంకేతమంటే?

కానీ ఇక్కడే ఈ కేసులో అసలైన మలుపు వచ్చింది. భర్త తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, వైద్య పత్రాలు, ప్రభుత్వ ఆసుపత్రి నివేదికలు, వ్యక్తిగత జీవన సాక్ష్యాలు సమర్పించాడు. పెళ్లికి ముందు, తర్వాత తనకు భార్యతో శారీరక సంబంధం ఉన్నట్లు వెల్లడించాడు. న్యాయమూర్తులు మౌసుమి భట్టాచార్య, బీఆర్ మధుసూధనరావు ఈ అంశాలను గమనిస్తూ, 40 నెలల పాటు సహజీవనం జరిగి ఉండగా సంబంధం లేదన్న వాదన ఎలా నమ్మగలమని ఆమెను ప్రశ్నించారు. ఆమె ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని తేల్చారు.

కోర్టు ఇచ్చిన తుది తీర్పు ఒక సామాజిక సందేశంగా నిలిచింది: “ఆరోపణలు ఉంటే సరిపోదు… వాటికి ఆధారాలు కూడా అవసరం. వివాహ బంధం అనేది మాటలతో తెగదు, ముద్రలతో విడిపోలేదు” అని పేర్కొన్నారు. శారీరక సంబంధం లేకపోవడం ఒక్కటే వివాహ విఫలమయ్యే కారణం కాదు. నమ్మకానికి బదులుగా అనుమానాలు బలపడితే, ఎంత బలమైన బంధమైనా విరగడమే. ఈ తీర్పు ద్వారా న్యాయవ్యవస్థ భావోద్వేగాల కంటే వాస్తవాలను ఆధారంగా తీసుకుని తీర్పులు ఇవ్వడం సమాజానికి ఇచ్చే బలమైన సందేశంగా నిలిచింది.

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు ముప్పు