Site icon HashtagU Telugu

Viral : పబ్లిక్ లో బ్రా వేసుకొని రీల్స్.. జనం చూస్తూ ఊరుకుంటారా..!!

Haryana Young Man Bra Reel

Haryana Young Man Bra Reel

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా ట్రెడ్ (Social Media Tread) నడుస్తోంది. దాదాపు అందరికి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. అంతేకాక చాలా మందికి ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి. ఇంకేముందు ఉదయం లేచిన దగ్గరి పడుకునే వరకు అంత సోషల్ మీడియా లో ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్ స్టా రీల్స్ చూస్తూ, చేస్తూ సోషల్ మీడియా అనే సముద్రంలో మునిగిపోతున్నారు.

ఇదే సమయంలో కొందరు ఫేమస్ అయ్యేందుకు రీల్స్, షాట్స్ చేస్తున్నారు. కొందరు ఫాలోవర్స్ పెంచుకోవాలని , ఫేమస్ కావాలనే ఉద్దేశ్యం..రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలనే అత్యాశతో రకరకాలుగా రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రతి రోజు ఇలా ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రమాదకర ప్రదేశాల్లో రీల్స్ చేయడం మానడం లేదు.

తాజాగా హరియాణాలో జనంతో రద్దీగా ఉన్న పానిపట్ ఇన్సార్ మార్కెట్లో ఓ యువకుడు రీల్స్ వైరల్ అయ్యేందుకు అమ్మాయిలా ‘బ్రా’ వేసుకొని హల్చల్ చేశాడు. అసభ్యంగా డాన్సులు వేస్తూ నానా రచ్చ చేసాడు. దీంతో అక్కడున్న ఆడవాళ్లంతా ఇబ్బంది పడ్డారు. అయితే ఇది గమనించిన ఓ చిరు వ్యాపారి సదరు యువకుడి చెంపలు వాయించి బుద్ధి చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇలా చేస్తేనే ఇలాంటి పిచ్చి రీల్స్ చేయడం తగ్గిస్తారని అంత కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Kohli Captain In IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. కింగ్‌కే ప‌గ్గాలు అని చెప్పే కార‌ణాలివే!