Site icon HashtagU Telugu

Shark Attack: దారుణం.. తండ్రి చూస్తుండగానే కొడుకుని చంపితిన్న షార్క్?

Shark Attack

Shark Attack

ప్రస్తుతం సమ్మర్ కావడంతో చాలా మంది ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో కలిసి అలా సరదాగా బీచ్ లకు ఎంజాయ్ చేయడానికి వెళుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు సరదాగా గడిపేందుకు వెళ్లిన ప్రదేశాలలో విషాదాలు కూడా నెలకొంటూ ఉంటాయి. ఇప్పటికే చాలా సందర్భాలలో అలా సంతోషంగా గడుపుతున్న సమయంలో కళ్ళ ముందు చూస్తుండగానే చాలా ఘోరాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కన్న తండ్రి చూస్తుండగానే ఒక షార్క్ కొడుకుని అమాంతం చంపి తినేసింది.

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వినడానికి భయంకరంగా ఉన్న ఈ ఘటన ఈజిప్టులో చోటు చేసుకుంది. ఈజిప్ట్ లోని ఫేమస్ రిసార్ట్ అయిన హుర్ఘదా సమీపంలో రష్యా కు చెందిన 23 ఏళ్ల టూరిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. తీరం వద్ద నిలబడి చూస్తున్న ప్రజలు చూస్తున్నారు తప్పితే ఏమి చేయలేని పరిస్థితి. క్షణకాలంలోనే టైగర్ షార్క్ ఆ యువకుడిపై పలుసార్లు దాడి చేసింది. సదరు బాధిత యువకుడిని వ్లాదిమిర్ పోపోవ్ గా గుర్తించారు. ఒడ్డున ఉన్న తండ్రి ని పాపా పాపా అంటూ తనను కాపాడాలని కోరాడు. ఆ ఘటన జరుగుతున్న సమయంలో ఒడ్డున ఉన్న తండ్రి అది చూసి ఒక్కసారిగా నిర్ఘాంత పోయాడు.

 

కళ్ళముందే కొడుకు చనిపోతున్న కూడా చూసి ఏమి చేయలేకపోయాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ షార్క్ దాడిని కెమెరాల్లో బంధించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో అక్కడున్న వారందరూ ఆ ఘటనను చూస్తూ గట్టిగా అరుస్తూ కేకలు వేశారు. పాపం ఆ 23 ఏళ్ల కుర్రాడు ఆ స్టార్ కు నుంచి తప్పించుకోవాలని గట్టిగా ప్రయత్నం చేసినప్పటికీ చివరికి దానికి ఆహారంగా మారాడు.