Site icon HashtagU Telugu

Godzilla Ramen : గాడ్జిల్లా రామన్.. మొసలి కాలుతో వంటకం.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా??

Godzilla Ramen dish make with Crocodile leg in Taiwan

Godzilla Ramen dish make with Crocodile leg in Taiwan

ప్రతి మనిషి వెరైటీని కోరుకుంటారు. చేసే పనిలో, తినే తిండిలో కొత్తదనాన్ని కావాలనుకోని వారు ఉండరు. అయితే ఈ ప్రయోగాలు అన్నీ అద్భుతలే అవుతాయని గ్యారెంటీ లేదు. ఒక్కోసారి చెత్తగా కూడా ఉంటాయి. అయితే మనకి చెత్త అని అనిపించింది కదా అని అందరూ అలానే అనుకుంటారు అని కూడా చెప్పలేం.

ఏదో వంటకం వండుకుంటూ ఉంటే అందులో ఓ జంతువు పడి చచ్చిపోయి దాని కాలు మాత్రమే మిగిలినట్టు కనిపిస్తోంది కదా.. ఇది పొరపాటున జరగలేదు.. ఈ డిష్ డిజైనింగే అలా ఉంది.. దీని పేరు గాడ్జిల్లా రామన్(Godzilla Ramen). ఇందులోంచి బయటకొచ్చింది స్వయానా ఒక మొసలి(Crocodile) ముందు కాలు. అత్యంత వికారంగా కనిపిస్తున్న ఈ వంటకం ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. తైవాన్ లోని ఓ రెస్టారెంట్ తయారుచేసిన ఈ డిష్ లో మొసలి కాలుని 40 రకాల మసాలాలతో కలిపి టేస్టీగా వండుతారట. రెస్టారెంట్ ఈ వంటకాన్ని తయారు చేసే తన ఫేస్బుక్ పేజీలో పెట్టింది. ఒక మహిళ దీనిని తిని చూసి వహ్వా ఏమి టేస్ట్ గురు అని ఫోటోకి ఫోజ్ ఇచ్చింది. ఇంకేముంది జనం ఇక్కడికి క్యూ కట్టారు.

ఈ రెస్టారెంట్ యజమాని కొంతకాలం క్రితం థాయిలాండ్ వెళ్ళాడట అక్కడే అతనికి ఈ ఐడియా వచ్చింది. బేసిక్ ఐడియాకి డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేసి లాస్ట్ కి ఇది ఫైనల్ చేసాడట. అన్నట్టు ఈ డిష్ తినడానికి రోజుకి ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంది. సో ముందు రోజు ఆర్డర్ చేసుకొని తరువాత రోజు వెళ్లి తినాలన్నమాట.

 

Viral Video: కొంగను పట్టుకొని ఎందుకు ప్రయత్నించిన అలిగేటర్.. కానీ అంతలోనే?