Goat: ఇదేందయ్యా ఇది.. మేక బరువు 100 కిలోల.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే?

సాధారణంగా మేకలు ఎంత బరువు ఉంటాయి అంటే 20 నుంచి 50 కేజీల లోపు ఉంటాయని చెబుతుంటారు. అంతకంటె తక్కువ ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. కొన్ని బాగా

  • Written By:
  • Publish Date - June 23, 2023 / 05:09 PM IST

సాధారణంగా మేకలు ఎంత బరువు ఉంటాయి అంటే 20 నుంచి 50 కేజీల లోపు ఉంటాయని చెబుతుంటారు. అంతకంటె తక్కువ ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. కొన్ని బాగా ఆరోగ్యంగా ఉన్న మేకలు కూడా 50 లేదా 60 కేజీలకు మించి ఉండవు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే మేక మాత్రం ఏకంగా 100 కేజీల బరువు ఉంది. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని తానే జిల్లాలో ఒక కుటుంబం మేకను పెంచుతోంది. ఆ మేక ఏకంగా 100 కేజీల బరువు వరకు పెరిగింది.

దాని ధరను యజమాని దాదాపు ఒక కోటి 12 లక్షల 786 రూపాయలుగా ఖరారు చేశాడు. కానీ అంతలోనే ఊహించని విషాదం నెలకొంది. సిద్ధార్థ్ నగర్ కు చెందిన షకీల్ అంబర్ నాథ్ రైల్వే స్టేషన్ ఎదురుగా బట్టల దుకాణం నడుపుతూ ఉంటాడు. ఆ బట్టల దుకాణం పైనే కుటుంబం మొత్తం ఆధారపడింది. షకీల్ దుకాణాన్ని కొనసాగిస్తూనే మరోవైపు మేకలు పెంచడం స్టార్ట్ చేశాడు. అలా ఒక మేకకు షేరు అనే పేరును పెట్టి సాగడం మొదలుపెట్టాడు. అతని శరీరంపై అల్లా, మహమ్మద్ అని ఉర్దూలో రాపించాడు. కుటుంబం అందరు కలిసి మేకను ఎంతో అల్లారి ముద్దుగా చూసుకున్నారు. ఆ మేక షకీల్ ఇంట్లోనే పుట్టింది.

దానికి కేవలం రెండు పళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆ మేక దాదాపు 100 కిలోల బరువు వరకు పెరిగింది. దాంతో దానిని విక్రయించాలని షకీల్ నిర్ణయించుకొని ఒక ధరను ఫిక్స్ చేశాడు. ఆ మేకను విక్రయించి గ్రామంలో ఒక పాఠశాల నెలకొల్పాలి అనుకున్నాడు. కానీ అతని కలలన్నీ కూడా నెరవేరకుండానే ఆ మేక చనిపోయింది. మేకకు ఉదయం సాయంత్రం యాపిల్ ద్రాక్ష మొక్కజొన్న జీడిపప్పు బాదం అంటే ఆహారాన్ని తినిపించేవాడు షకీల్. అయితే గత కొద్దిరోజులుగా ఆ మేక ఆరోగ్యం విషయమించింది. ఆ మేక కు ఆరోగ్యం చేయించడం కోసం షకీల్ దాదాపు రోజుకి 2,000లు విలువైన మందులను వైద్యుడు వద్ద నుంచి తీసుకొని వచ్చేవాడు. అయితే ఈనెల 29న బక్రీద్ పండుగ నాటికి ఆ మేకకు నయమవుతుందని భావించాడు. కానీ ఊహించని విధంగా ఆ మేక మృతి చెందడంతో అతని ఇంట్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకున్న మేక మరణించడంతో కుటుంబ సభ్యులు గుండెలు విలసేలా రోదిస్తున్నారు.