Girls: ఇంట్లో ఒకే కానీ బడిలోనికి వెళితే దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తున్న బాలికలు..! దెయ్యాలా…?

Girls: ఒక ప్రభుత్వ పాఠశాలలో 9, 10 వ తరగతి విద్యార్తినులు బడికి వెళ్తే అసాధారణంగా ప్రవర్తిస్తున్న ఘటన ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని షాహదోల్ జిల్లాలో చోటు చేసుకుంటుంది. ఇంటి వద్ద చాలా మామూలుగా ప్రవర్తిస్తున్న అమ్మాయిలందరూ బడిలోకి వెళ్ళగానే సగం అపస్మాక స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఇతరుల తల వెంట్రుకలు లాగి పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారు. ఈ వింత గత 15 రోజులుగా బడిలో చోటు చేసుకుంటుండడం గమనార్హం. ఈ విషయంపై ఎలాంటి స్పష్టత లేక గ్రామస్తులు […]

Published By: HashtagU Telugu Desk
Girls

Girls

Girls: ఒక ప్రభుత్వ పాఠశాలలో 9, 10 వ తరగతి విద్యార్తినులు బడికి వెళ్తే అసాధారణంగా ప్రవర్తిస్తున్న ఘటన ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని షాహదోల్ జిల్లాలో చోటు చేసుకుంటుంది. ఇంటి వద్ద చాలా మామూలుగా ప్రవర్తిస్తున్న అమ్మాయిలందరూ బడిలోకి వెళ్ళగానే సగం అపస్మాక స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఇతరుల తల వెంట్రుకలు లాగి పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారు.

ఈ వింత గత 15 రోజులుగా బడిలో చోటు చేసుకుంటుండడం గమనార్హం. ఈ విషయంపై ఎలాంటి స్పష్టత లేక గ్రామస్తులు తలలు బద్దలు కొట్టుకుంటున్నాడు. కొంతమంది అయితే దీనికి మంత్ర తంత్రాలు కారణం అంటున్నారు. దయ్యాలను బడిలోని పిల్లలపైకు వదులుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే నిపుణులు మాత్రం ఇది మాస్ హిస్టీరియా వల్ల జరిగే సైకలాజికల్ ప్రాబ్లమ్ అని చెబుతున్నారు. ఈ ఘటనలు తర్వాత సీనియర్ తరగతులు క్లాసులను వెంటనే స్కూలు సిబ్బంది మరొక భవంతిలోకి మార్చారు.

ఒకరు కాదు, ఇద్దరు కాదు ఒక్కసారిగా ఏడుగురు విద్యార్థినిలు ఇలా అసాధారణంగా ప్రవర్తించడం జరిగిందని ఆ గ్రామ సర్పంచ్ చెప్పుకొచ్చాడు. ఇలాంటివి ఇదివరకే జరిగాయని… అప్పుడు మతపరమైన క్రతువులు చేపట్టిన తర్వాత అవి ఆగిపోగా ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా జరగడం మదలయిందని ఆయన చెప్పారు. ఇక వీరంతా ఇంటి వద్ద సాధారణంగానే ఉంటూ స్కూల్లో మాత్రమే పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారని సర్పంచ్ శివకుమార్ పనికా చెప్పడం జరిగింది. ఇలా ప్రవర్తించిన బాలికలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు కూడా ఆయన తెలిపారు.

  Last Updated: 18 Dec 2022, 10:38 PM IST