Site icon HashtagU Telugu

UK: చూస్తుండగానే సముద్రంలోకి జారిపడిన యువతి.. చివరికి?

Uk

Uk

ఈ మధ్యకాలంలో చాలామంది యువత సోషల్ మీడియాపై ఉన్న పిచ్చితో ఏం చేస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన స్థలాలలో పిచ్చిపిచ్చి తండ్రి చేస్తూ అనవసరంగా ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఎత్తు ప్రదేశాలపై,రైల్వే ట్రాక్లపై నీటికి సమీపంలో పిచ్చిపిచ్చి స్టంట్ లు చేసి జీవితాలను అర్ధాంతరంగా చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా నీరు ఉన్న ప్రదేశాలలోనే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.

తాజాగా కూడా ఒక యువతి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొని బయటపడింది. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కొందరు పీర్ స్లిప్‌వేపై ఆడుకుంటూ ఉన్నారు. సముద్ర అలలు వస్తూ పోతూ ఉండగా వారు దాన్ని ఆనందిస్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో అకస్మాత్తుగా, ఊహించని విధంగా ఒక బలమైన కెరటం అందులోని ఒక యువతిని తాకింది. దీంతో ఆమె తన బ్యాలెన్స్ కోల్పోయి సముద్రంలోకి వెళ్లిపోయింది. ఒడ్డుకు వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ కెరటాల ధాటికి యువతి చేరుకోలేకపోతుంది.

 

చివరికి ఆమెను కాపాడేందుకు సముద్రంలో ఎగసిపడుతున్న కెరటాలకు ఎదురెళ్లి ఒక వ్యక్తి సదరు బాలికను రక్షించగలిగాడు. ఈ ప్రమాదం నుంచి బయటక పడిన యువతికి స్వల్ప గాయలు అయ్యాయి. నార్త్ డెవాన్ కౌన్సిల్ అత్యవసర హెచ్చరికతో పాటు ట్విట్టర్‌లో ఈ వీడియోని షేర్‌ చేసింది. సముద్రం తీరం వద్ద అధిక ఆటుపోట్లు ఉన్నప్పుడు జాగ్రత్త వహించాలని ప్రజలను కోరింది. సముద్రంలోని అలలు పరిస్థితులు బట్టి మారుతుంటాయి. కొన్ని సార్లు ప్రమాదకర స్థాయికి చేరుకుంటాయి.