Viral : లిఫ్ట్‎లో ఇరుక్కున్న చిన్నారి..20 నిమిషాల పాటు నరకయాతన

ఆ చిన్నారి లిఫ్ట్ లోకి ఎక్కిన మరుక్షణమే కరెంటు పోయింది. దీంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ సమయంలో లిఫ్టులో చిన్నారి ఒంటరిగా ఉండటంతో భయాందోళనకు గురైంది

Published By: HashtagU Telugu Desk
Girl Stuck Inside Lift

Girl Stuck Inside Lift

ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన లిఫ్ట్ (Lift) లు అనేవి కామన్ అయ్యిపోయాయి. ఒకప్పుడు పెద్ద పెద్ద బ్లిడింగ్స్ , ఆఫీస్ లలో మాత్రమే వీటిని ఉపయోగించేవారు కానీ..ఈరోజుల్లో రెండు , మూడు అంతస్థులకు కూడా లిఫ్ట్ అనేది వాడుతున్నారు. అయితే అప్పుడప్పుడు లిఫ్ట్ లలో పెను ప్రమాదాలు జరుగుతున్నాయి. మధ్యలో లిఫ్ట్ ఆగిపోవడం..ఉపిరిడక నరకయాతన అనుభవించిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ చిన్నారి (Girl) దాదాపు 20 నిమిషాలపాటు లిఫ్ట్ లో ఇరుక్కొని నరకయాతన అనుభవించింది. దీనికి సంబదించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

ఉత్తరప్రదేశ్ లోని లక్నో (Lucknow)లో కుర్సీలో జనేశ్వర్ ఎన్ క్లేవ్ (Janeshwar Enclave housing society) లోని బి 1105 ఫ్లాట్ లో ఉంటున్న ధ్వని అవస్థి అనే చిన్నారి బుధవారం లిఫ్ట్ లోకి వెళ్లింది. అయితే ఆ చిన్నారి లిఫ్ట్ లోకి ఎక్కిన మరుక్షణమే కరెంటు పోయింది. దీంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ సమయంలో లిఫ్టులో చిన్నారి ఒంటరిగా ఉండటంతో భయాందోళనకు గురైంది. అయినా కూడా ఏమాత్రం భయపడకుండా తలుపును తెరిచే ప్రయత్నం చేసింది. తలుపులు ఎంతకూ తెరచుకోకపోవడంతో…గట్టిగా అరవడం, ఏడవడం మొదలుపెట్టింది. చేతులు జోడించి దేవుడా ఎలాగైనా నన్ను రక్షించు అంటూ ప్రార్థించింది. ఇలా 20 నిమిషాల పాటు లిఫ్టులో ఏడుస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత కరెంటు రావడంతో చిన్నారి సురక్షితంగా బయటకు వచ్చింది. దీనికి సంబదించిన వీడియో వైరల్ గా మారింది.

Read Also : Anasuya Bharadwaj : ఇంటెర్నెట్ కే సెగలు పుట్టిస్తున్న అనసూయ భరద్వాజ్

  Last Updated: 05 Oct 2023, 12:56 PM IST