ప్రస్తుతం ఒకవైపు ఎండలు మండిపోతుండగా మరొకవైపు గాలితో కూడిన వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. కొన్ని కొన్ని ప్రదేశాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వల్ల ఆ లోతట్టు ప్రాంతాలు మునిగి జలమయం అవుతున్నాయి.. అయితే వర్షాలు పడే సమయంలో ఈదురు గాలులు వీచే సమయంలో బయటకు రావద్దని ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు.. కానీ ప్రజలు మాత్రం వాటిని పెడ చెవిన పెట్టి వర్షాలు పడుతున్న ఈదురు గాలులు వేగంగా గాలులు వీస్తున్నా కూడా అలాగే వాహనాలు ప్రయాణించడం ఆరు బయట ఉండడం లాంటివి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు..
కొంతమంది అదృష్టవశాత్తు తప్పించుకోగా మరి కొంతమంది మాత్రం ప్రాణాలను కోల్పోతున్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో మన అదృష్టమే మనల్ని కాపాడుతుందని చెప్పవచ్చు. తాజాగా జరిగిన సంఘటన అందుకు చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు. ప్రస్తుతం నెట్టింట్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జరిగిన సంఘటనను చూసి ఒక్కసారిగా నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. వీడియోని బట్టి చూస్తుంటే ఆ ప్రదేశంలో జోరుగా వానలు కురవడంతో పాటు పెద్ద పెద్ద గాలులు వీస్తున్నాయి. అటువంటి సమయంలోనే రోడ్డుపై వాహనాలు ప్రయాణిస్తున్నాయి.
बच गयी बेचारी😒 pic.twitter.com/JffLvGcL5s
— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) June 25, 2023
ఇంతలోనే ఆ ఈదురు గాలులకు ఒక పెద్ద చెట్టు విడిగే రోడ్డుపై పడింది. కరెక్ట్ గా అదే సమయానికి ఒక స్కూటీలో యువతి వస్తూ ఉండగా రెప్పపాటు కాలంలో ఆ చెట్టు ఆ యువతిపై కాకుండా పక్కనే పడింది. దాన్ని గమనించిన యువతి ఇవే సడన్గా బ్రేక్ వేయడంతో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆ యువతీ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా బ్రేక్ వేయకుండా మర్చిపోయిన కూడా చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఆ వీడియో వైరల్ అవ్వడంతో చాలా ప్రమాదం తప్పింది. ఒకవేళ ఆ ప్రమాదం జరిగి ఉంటే ఆ మహిళ చనిపోయేదేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఆమెకు అదృష్టం బాగుంది ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.