Scooty Yoga: స్కూటీపై యోగా స్టంట్స్.. చక్కర్లు కొడుతున్న అమ్మాయి వీడియో!

ఇటీవల సోషల్ మీడియాలో ఓ అమ్మాయి వీడియో హల్ చల్ చేస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Yoga

Yoga

నేటి డిజిటల్ ప్రపంచంలో అనేక వీడియోలు వైరల్ (Viral) గా మారుతున్నాయి. ఒక్కో వీడియో (Video) మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతూ ట్రెండింగ్ అవుతున్నాయి. అనేక మంది మనసును దోచేస్తున్నాయి. టెక్నాలజీ కారణంగా ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పలేం. ఇక ఈతరం యూత్ ఒక్కరోజులోనే సెలబ్రిటీగా అవతారమెత్తాడానికి ఎన్నో ఫీట్లు చేస్తున్నారు. అరుదైన వీడియోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అమ్మాయి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇటీవల సోషల్ మీడియా (Social Media)లో ఓ అమ్మాయి (Girl) వీడియో హల్ చల్ చేస్తోంది. ఒక స్టంట్ వీడియో పోస్ట్ కావడంతో  వైరల్ అయ్యింది. యోగా అంటే ఇష్టపడే ఓ  అమ్మాయి స్కూటీ (Scooty) మీద కూర్చుని యోగా చేస్తూ కనిపించింది. అంతేకాదు.. అనేక ఆసనాలు, ఫీట్లు (Stunt) చేస్తూ ఇతరులను ఆశ్చర్యపరుస్తుంది. ఆ వీడియోను ముస్కాన్ రణ యోగా అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో నిమిషాల్లోనే వైరల్ గా మారింది. ఆ వీడియోకు 433,000 వ్యూస్ వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వాచ్ చేయ్యండి.

Also Read:Janhvi with Ram Charan: రామ్ చరణ్ తో జాన్వీ రొమాన్స్.. మరో ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ!

  Last Updated: 22 Apr 2023, 06:18 PM IST