Site icon HashtagU Telugu

Madhya Pradesh: కోపంతో చైనా ఫోన్ మింగేసిన యువతి.. తర్వాత ఏం జరిగిందో తెలుసా?

Madhya Pradesh

Madhya Pradesh

సాధారణంగా ఇంట్లో అన్నా చెల్లెలు లేదంటే పిల్లలు ఉన్నారు అంటే కొట్టుకోవడం,తిట్టుకోవడం, అలగడం, కోప్పడడం, వస్తువులు విసిరి వేయడం పగలగొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. కోపంలో పనులు చేసి ఆ తర్వాత తల్లిదండ్రులతో చివాట్లు తింటూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఆ చిన్న చిన్న గొడవల కారణంగా కొందరు ఇతరులను గాయపరిస్తే ఇంకొందరు తమను తానే గాయపరచుకుంటూ ఉంటారు. గొడవ ముగిసిన తర్వాత ఇంత పెద్ద గొడవ జరిగిందా అని వాళ్ళే ఆశ్చర్యపోతుంటారు.

తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో 18 ఏళ్ల యువతీకి ఆమె సోదరుడికి చైనా మొబైల్ ఫోన్ విషయంలో గొడవ మొదలైంది. అలా వారిద్దరూ చాలా సేపటి వరకు గొడవ పడుతూనే ఉన్నారు. ఇక గొడవ ఎంతసేపటికి పరిష్కారం కాకపోయేసరికి వెంటనే యువతి పట్టరాని కోపంతో వచ్చిన మొబైల్ ఫోన్ ని మింగేసింది. సెల్ ఫోన్ ని మింగిన వెంటనే ఆమెకు విపరీతమైన కడుపు నొప్పి వాంతులు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను గ్వాలియర్స్ లోని జయరోగ్య ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు అల్ట్రా స్టాండ్ ఇతర పరీక్షలు నిర్వహించి యువతీ కడుపులో మొబైల్ ఫోన్ ఉందని తెలిపారు. అనంతరం వైద్యులు ఆపరేషన్ చేసి యువతి కడుపులో ఉన్న మొబైల్ ఫోన్ ని బయటికి తీసేసారు. దాదాపు రెండు గంటల సమయం పాటు ఎమర్జెన్సీ సర్జరీ తర్వాత యువతీ కడుపులో నుంచి మొబైల్ ఫోను బయటికి తీశారు. ఆమె ఆరోగ్యం నెలకడగా ఉన్నట్లు తెలిపారు. కోపంలో ఆ యువతి తీసుకొని నిర్ణయం ఆమె ప్రాణాలకే ప్రమాదంగా మారింది. కానీ ఆ యువతి అదృష్టవశాత్తు బతికి బయటపడింది.