Site icon HashtagU Telugu

Ghaziabad: ట్రాఫిక్ లో అందరి ముందు బైక్ పై రెచ్చిపోయిన జంట.. భారీ జరిమానా విధించిన పోలీసులు?

Ghaziabad

Ghaziabad

ఈ తరం యువత ప్రేమ అనే ఒక పిచ్చి మోజులో పడి జీవితాలను చేజేతులా నాశనం చేసుకోవడంతో పాటు ఏం చేస్తున్నారో ఎక్కడ ఉన్నారో తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో అయితే కొన్ని ప్రేమజంటలు మరింత దిగజారిపోయి ప్రవర్తించాయి. బైక్ పై అందరూ చూస్తుండగానే పబ్లిక్ లో ముద్దులు పెట్టుకోవడం రొమాన్స్ లు చేసుకోవడం హత్తుకోవడం లాంటివి చేస్తున్నారు. రోడ్లపైనే బరితెగించి ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు సందర్భాలలో ఇలా బైక్ పై ప్రియురాలిని కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేస్తూ రొమాన్స్ చేసిన వారికి పోలీసులు వారి స్టైల్ లో బుద్ధి చెప్పారు.

అయినా కూడా కొంతమందికి బుద్ధి రావడం లేదు. తాజాగా ఢిల్లీ మెట్రో ట్రైన్ లో ఒక యువతి యువకుడు పబ్లిక్ లో అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ ఘటన ఇంకా మరువకముందే తాజాగా మరొక జంట నడిరోడ్డుపై రెచ్చిపోయి ప్రవర్తించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు సీరియస్ గా స్పందించారు. కాగా ఒక యువకుడు బైక్ నడుపుతుండగా, అతడిని కౌగిలించుకుని ఒక యువతి ముందు భాగంలో కూర్చుంది.

 

పోని నిదానంగా వెళుతున్నారా? అంటే అదీ లేదు. వేగంగా దూసుకుపోతున్నారు. పైగా ఇద్దరికీ హెల్మెట్లు లేవు. వీరి వ్యవహారాన్ని కారులో వెళుతున్న ఒక వ్యక్తి షూట్ చేశారు. జాతీయ రహదారి9పై ఇందిరాపురం పరిధిలో ఇది జరిగింది. దీనిపై ఘజియాబాద్ పోలీసులు స్పందించారు. ట్విట్టర్ నుంచి అందిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నాము. చలానాను కూడా జారీ చేశాము అని తెలిపారు. వాహన దారుడికి రూ.21,000 చలానా విధించారు. ఇందుకు సంబంధించిన ఫొటోని పోలీసులు షేర్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు వారికి బాగా బుద్ధి చెప్పారు ఇకపై ఇలాంటి పనులు చేయాలి అంటే చాలా మందికి భయం పుట్టాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.