Gangavva Properties : గంగవ్వ (Gangavva ) ఈమె గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం.. జగిత్యాల జిల్లా లోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన ఈమె..పెద్దగా చదువు కోకపోయిన..తన మాట తీరు తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. వ్యవసాయం చేసుకుంటూ ఉండే ఈమె జీవితాన్ని బిగ్ బాస్ షో (Bigg Boss Show) మార్చేసింది. అప్పటి వరకు మై విలేజ్ షో (My Village Show) అనే యూట్యూబ్ ఛానల్ లో యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకోగా..ఆ గుర్తింపు తో బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేసింది. ఈ షో తో మరింత పాపులర్ అయ్యింది. ఈ షో నుండి బయటకు వచ్చాక సినిమా ఛాన్సులు సైతం తలుపు తట్టాయి. అలాగే ఈ షో ద్వారా భారీగానే రెమ్యూనరేషన్ తెచ్చుకుంది. ప్రస్తుతం యూట్యూబ్ వీడియో తో పాటు అప్పుడప్పుడు వెండితెరపై కనిపిస్తూ వస్తుంది.
తాజాగా తన ఆస్తుల (Gangavva Properties) వివరాలు స్వయంగా ఆమెనే బయటపెట్టి అందరికి షాక్ ఇచ్చింది. ఆ వీడియో లో ఆమె మాట్లాడుతూ..బిగ్‌బాస్ తర్వాత తన జీవితం చాలా మారిందని తెలిపింది. బిగ్ బాస్ డబ్బుతో ఇల్లు కట్టుకున్నానని..దానికి రూ. 22 లక్షలు అయ్యిందని , అలాగే తన ఆవుల కోసం రేకుల షెడ్డు నిర్మించుకున్న దానికి రూ. 3 లక్షలు , నాలుగున్నర గుంటల పొలం కొన్నాను. ఇప్పుడు దీని ధర రూ. 9 లక్షలు. మరో చోట రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఇది దాదాపు రూ.75-80 లక్షలు పలుకుతోంది.. కమర్షియల్ ప్లాట్ కొనడానికి సుమారు రూ.3 లక్షలు అయ్యింది.15 గుంటల వ్యవసాయ భూమి ఉంది.. దీని విలువ ఏడెనిమిది లక్షల రూపాయలు ఉంటుంది. మొత్తంగా తన ఇల్లు, వ్యవసాయ భూమి, కమర్షియల్ ప్లాట్స్ అంతా కలిపి కోటి 24 లక్షల విలువ చేస్తుంది. అలాగే తనకంటూ ఐదు తులాల బంగారం ఉందని, ఎప్పటికైనా 50 ఆవులను తీసుకుని వాటిని పెంచుతూ, పాలమ్ముతూ బతకాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు. ఇక తను సంపాదించినదాంట్లో కూతుర్లిద్దరికీ చెరో రూ.2 లక్షలు, మనవరాలి పెళ్లికి రూ.2.5 లక్షలు ఇచ్చినట్లు తెలిపింది. ఈమె తెలిపింది విని అంత నోరు వెళ్లబెడతున్నారు.
Read Also : Kohli Joins Team India: లండన్ నుంచి చెన్నైకు, కేంద్రమంత్రి స్థాయి భద్రత