Ganesh Temple – Currency Decoration : రూ.65 లక్షల కరెన్సీతో గణపతి ఆలయం ముస్తాబు

Ganesh Temple - Currency Decoration : వినాయక చవితి పండుగ వేళ వినూత్నమైన గణేశుడి మండపాలను ఏర్పాటు చేస్తుంటారు.

Published By: HashtagU Telugu Desk
Ganesh Temple Currency Decoration

Ganesh Temple Currency Decoration

Ganesh Temple – Currency Decoration : వినాయక చవితి పండుగ వేళ వినూత్నమైన గణేశుడి మండపాలను ఏర్పాటు చేస్తుంటారు. కొత్త కొత్త రూపాలతో కూడిన వినాయక ప్రతిమలను ఏర్పాటు  చేస్తుంటారు. ఈక్రమంలోనే కర్ణాటకలోని బెంగళూరులో శ్రీ సత్య గణపతి ఆలయ నిర్వాహకులు ఇంకా విభిన్నంగా ఆలోచించారు.  ఏటా ఒక్కో రకంగా గణేశుడి నవరాత్రి వేడుకలను నిర్వహించే ఆలయ నిర్వాహకులు.. ఈసారి కూడా కొత్తదనాన్ని ప్రదర్శించారు. ఆలయాన్ని డెకొరేషన్ చేసేందుకు వందల కొద్ది నాణేలు, కరెన్సీ నోట్లను వినియోగించారు. ఆ నాణేలు, కరెన్సీ నోట్ల మొత్తం విలువ ఎంతో తెలుసా ? రూ.65 లక్షలు !!  రూ.10 నుంచి రూ.500 వరకు నోట్లు ఇందులో ఉన్నాయి. మొత్తం  కరెన్సీతో వెరైటీగా , అట్రాక్టివ్ గా ఈ ఆలయాన్ని అందంగా అలంకరించారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి వేళ శ్రీ సత్య గణపతి ఆలయాన్ని పర్యావరణ హితంగా ముస్తాబు చేస్తుంటారు. గతేడాది ఆలయాన్ని పూలు, మొక్కజొన్న, అరటి కాయలు, రక రకాల పండ్లతో డెకొరేట్ చేశారు. అదే గ్రీన్ కల్చర్ ను కొనసాగిస్తూ.. ఈసారి కూడా పర్యావరణ హితంగా ఉండే కరెన్సీ నోట్లను డెకొరేషన్ కోసం (Ganesh Temple – Currency Decoration) వినియోగించారు.

Also read : AP BJP : స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ల‌కు సీఐడీ వెళ్లిందా..? : ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వ‌రి

  Last Updated: 18 Sep 2023, 01:13 PM IST