Frankfurt: ఎయిర్ పోర్ట్ ని ముంచెత్తిన భారీ వరదలు.. మోకాలి లోతు నీరు?

ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. రోడ్లన్నీ జలమయం అవ్వడంతో పా

  • Written By:
  • Publish Date - August 17, 2023 / 04:10 PM IST

ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. రోడ్లన్నీ జలమయం అవ్వడంతో పాటు ఎయిర్ పోర్ట్ లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలను పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జర్మనీలో ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరం భారీ వర్షాలతో జలదిగ్బంధమయింది. దీంతో పలు చోట్ల రహదారులు నదులను తలపిస్తున్నాయి. చిన్నచిన్న వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

ఒక గంటలోనే దాదాపు 25 వేలసార్లు మెరుపులు వచ్చాయంటే తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దాంతో అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. రన్‌వేపైకి భారీగా నీరు చేరి విమానాలు తేలియాడుతున్నట్లు కన్పిస్తున్నాయి. అటు ఎయిర్‌పోర్టులోని ఎస్క్‌లేటర్‌, దుకాణాల్లోకి భారీగా వరద చేరింది.

 

బుధవారం రాత్రి నుంచి ఇక్కడ ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో జర్మనీ ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయమైన ఫ్రాంక్‌ఫర్ట్‌ ఎయిర్‌పోర్టు వరదల్లో చిక్కుకోవడంతో అక్కడి సేవలు నిలిచిపోయాయి. ఇక్కడి నుంచి బయల్దేరే అనేక విమానాలను రద్దు చేశారు.

 

ఎయిర్‌పోర్టుకు వచ్చే విమానాలను దారిమళ్లించారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపైకి వరద చేరిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అటు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు కూడా నీటమునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తుపాను ప్రభావంతో రానున్న రోజుల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్థానిక వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు .