Site icon HashtagU Telugu

Viral : వామ్మో ఎగిరే పామును మీరు ఎప్పుడైనా చూశారా..?

Snake Flying In Punjab

Snake Flying In Punjab

పాము అంటే నేలమీద , చెట్ల మీద మాత్రమే ఉంటాయని తెలుసు..కానీ గాల్లో కూడా ఎగురుతాయని తాజాగా వెలుగులోకి వచ్చింది. పాములు పొడవుగా, పొలుసులు కలిగి, కాళ్లులేని, భూచరాలైన సరీసృపాలు. ఇంతవరకు పాములలో 2,900 జాతులను గుర్తించారు. ఇవి అంటార్కిటికాలో మినహా ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ఇందులో చాలా వరకు విషపూరితం కావు. మొత్తం ఇరవై కుటుంబాలలో మూడింటికి చెందినవి మాత్రమే హానికరమైనవి. పాములకు చేవులు ఉండవు కనీ పాముకు, ఆంతర్ చెవులు ఉంటాయి. పాశ్చాత్య సంప్రదాయాలలో పాముల్ని క్షుద్రమైనవిగా భావిస్తారు. కానీ భారతదేశంలో, హిందువులు పాముల్ని నాగ దేవతలుగా పుజిస్తారు. అయితే ఇప్పటివరకు పాములంటే నేలమీద పరుగులు పెట్టడం..చెట్ల మీద ఉంటాయనే తెలుసు. కానీ తాజాగా పాములు సైతం పక్షుల్లా గాల్లో ఎగురుతాయని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పంజాబ్ లో జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

పంజాబ్‌లోని జలాలాబాద్ జిల్లాలో సెలూన్ వెలుపల కూర్చున్న కొంతమంది స్నేహితులు మాట్లాడుతుండగా.. అంతలోనే అకస్మాత్తుగా ఎగిరే పాము వారి మీద నుండి వెళ్లింది. ఊహించని సంఘటనలో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. అంతే కాదు.. ఆ పామును వారి వెంటపడిందని వారు చెప్పుకొచ్చారు. ఎగిరే పామును చూసి వారంతా భయాందోళనకు గురై అటు ఇటు పరిగెత్తారు. ఎగిరే పాము చివరకు సెలూన్‌లోని గ్లాస్‌కు తగిలి కిందపడిందని ,.. దాంతో అతి కష్టం మీద వారంతా తమ ప్రాణాలను కాపాడుకున్నామని, పాము నుంచి తప్పించుకుని ఎలాగోలా తిరిగి తమ ఇళ్లకు వెళ్లగలిగామని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Read Also : Mrigasira Karthi : చేపలకు ఫుల్ డిమాండ్