Site icon HashtagU Telugu

Viral Video : ముగ్గురు దుండగులు.. పట్టపగలు ఫైరింగ్.. కర్ణిసేన చీఫ్ మర్డర్

Viral Video

Viral Video

Viral Video : సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగమేడి.. రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన అధినేత. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాజస్థాన్‌ జైపూర్‌లోని శ్యామ్‌నగర్‌లో ఉన్న ఆయన ఇంట్లోకి ముగ్గురు దుండగులు చొరబడి కాల్పులు జరిపారు. దుండగులు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగమేడి గన్‌మెన్ నరేంద్రపైనా ఫైరింగ్ చేశారు. గోగమేడి తల, ఛాతీ భాగాలపై కాల్చారు.  గోగమేడిని చంపాలనే ఉద్దేశంతోనే అతడి తలపై పదే పదే ఫైరింగ్ చేశారని సీసీటీవీ ఫుటేజీని బట్టి వెల్లడైంది. ఈ దాడిలో మరో ఇద్దరు కూడా గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.  సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగమేడి సహచరులు, భద్రతా సిబ్బంది కాల్పుల్లో ముగ్గురు దుండగుల్లో ఒకడైన నవీన్‌ షెకావత్‌ మరణించాడు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో లైవ్ ఫైరింగ్ విజువల్స్ రికార్డ్  అయ్యాయి. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. సుఖ్‌దేవ్‌ హత్యకు తమదే బాధ్యత అంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠాకు అనుబంధంగా పనిచేసే రోహిత్‌ గోదారా గ్యాంగ్‌ ప్రకటించుకుంది. ఈ ఘటనలో ఉదయపూర్‌లోని కర్ణి సేన జిల్లా మాజీ అధినేత దిగ్విజయ్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

https://twitter.com/PTI_News/status/1731988066406191330

We’re now on WhatsApp. Click to Join.

2015లో లోకేంద్ర సింగ్ కల్వి నేతృత్వంలోని కర్ణి సేన నుంచి విడిపోయిన తర్వాత సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగమేడి కొత్త సంస్థను స్థాపించారు. ఎదురుగా ఉన్న మురికివాడ నుంచి తనకు ప్రాణహాని ఉందని గతంలో సుఖ్‌దేవ్‌ సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఇంట్లోకి దుండగులు ప్రవేశించి.. సోఫాలో కూర్చొని.. టీ తాగుతూ పది నిమిషాల పాటు మాట్లాడినట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. ఎలాంటి కవ్వింపు లేకుండా ఒక్కసారిగా ముగ్గురు దుండగులు కాల్పులు(Viral Video) జరిపారు. ఐదో బుల్లెట్ సుఖ్‌దేవ్‌ సింగ్‌ తలలోకి దూసుకెళ్లింది.

Also Read: KIFF 2023: డ్యాన్స్ చేసిన సీఎం మమతా బెనర్జీ