Uttar Pradesh: ఇద్దరు యువకులతో మహిళ డాక్టర్ రాసలీలలు

ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా వైద్యురాలు ఇద్దరు మగ స్నేహితులతో కలిసి ఓ హోటల్‌లో పట్టుబడింది. సదరు మహిళా వైద్యురాలిని తన భర్త అభ్యంతరకర పరిస్థితుల్లో పట్టుకున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Uttar Pradesh

Uttar Pradesh

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా వైద్యురాలు ఇద్దరు మగ స్నేహితులతో కలిసి ఓ హోటల్‌లో పట్టుబడింది. సదరు మహిళా వైద్యురాలిని తన భర్త అభ్యంతరకర పరిస్థితుల్లో పట్టుకున్నాడు.

పాటియాలీ పట్టణంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా వైద్య వృత్తిలో ఉన్న ఆమె ఇద్దరు యువకులతో కలిసి హోటల్ కు వెళ్లడం వైరల్ గా మారింది. సమాజంలో మంచి పేరున్న వృత్తిలో ఉంటూ ఆమె చేసిన ఈ పనిని ప్రతి ఒక్కరు తప్పుబడుతున్నారు. ఇద్దరు యువకులతో కలిసి ఓ హోటల్‌లో ఉన్న ఆమెను భర్తకు కనిపించడంతో తన భర్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. కాగా ఆ పరిస్థితుల్లో చూసిన ఇతర కుటుంబ సభ్యులు యువకులిద్దరినీ తీవ్రంగా కొట్టి భార్యతో పాటు పోలీసులకు అప్పగించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలతో యువకులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మహిళా వైద్యురాలికి, ఆమె భర్తకు మధ్య చాలా రోజులుగా కుటుంబ కలహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలపై ఇద్దరు యువకులను జైలుకు పంపినట్లు ఇన్‌స్పెక్టర్ గోవింద్ వల్లభ్ శర్మ తెలిపారు.

Also Read: Indian Military: మాల్దీవుల నుంచి వెన‌క్కి వ‌చ్చేసిన భార‌త సైనికులు..!

  Last Updated: 10 May 2024, 11:55 PM IST