Site icon HashtagU Telugu

Women Cop Dance: నిమజ్జనంలో సూపర్ విమెన్స్ .. ఉరమాస్ డ్యాన్స్

Women Cop Dance

Women Cop Dance

Women Cop Dance: హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు పెట్టింది పేరు. దేశంలో ముంబై తరువాత ఆ స్థాయిలో గణేష్ ఉత్సవాలను హైదరాబాద్ లోనే జరుపుతారు. 11 రోజులు భక్తిశ్రద్ధలతో పూజించి చివరి రోజున గణనాథుడిని తల్లి గంగమ్మ ఒడిలో చేరుస్తారు. అయితే పదకొండు రోజులు ఎంత భక్తితో అయితే జరుపుకుంటారో, నిమజ్జనం రోజున అంతే సందడిగా ఊరేగిస్తారు. ఊరువాడా అంతా కలిసి గణపతిని తల్లి వద్దకు చేరుస్తారు. ఇక నగరంలో నిజ్జనం హోరెత్తుతోంది. చిన్న పెద్ద, ముసలి, ముతక అనే తేడా లేకుండా ప్రతిఒక్కరు కాలు కదుపుతారు. డ్యాన్సులు, విన్యాసాలతో విగ్నేశ్వరుడిని అత్యంత భక్తిసందడితో రోడ్లన్నీ తిప్పుతారు.

నిమ్మజ్జనంలో పోలీసులు ముఖ్య పాత్ర వహిస్తారు. వాళ్ళు లేకుండా ఉత్సవాలు జరగడం అసాధ్యం. లక్షలాది సమూహం నడుమ ఊరేగింపు అంటే మాటలు కాదు. అయితే పోలీసులు కష్టపడుతూ భద్రత కల్పించాలని లేదు కదా.. అందుకే కొందరు ఖాకీలు గణేష్ నిమజ్జనంలో తమ ప్రతిభను బయటకు తీస్తారు. మీకంటే మేమేమి తక్కువ కాదన్నట్టు చిందులేస్తారు. నిన్న గురువారం గణేష్ నిమజ్జనంలో పోలీసులు నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మహిళ పోలీసులు నిమజ్జనంలో చిందులేసిన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మాస్ డ్రమ్స్ కి విమెన్ కాప్స్ ఊర మాస్ డాన్సులతో హోరెత్తించారు.

గణేష్ నిమజ్జనానికి లక్షలాది మంది భక్తులు ట్యాంక్‌బండ్‌కు తరలిరాగా, హైదరాబాద్ పోలీసులు తమ విధుల్లో మాస్ డాన్స్ లో అలరించారు. గణేష్ ఊరేగింపు సందర్భంగా చాంద్రాయణగుట్ట ప్రాంతంలో పెద్దఎత్తున తరలివచ్చి కాలు దువ్విన మగ పోలీసులే కాకుండా ఇద్దరు మహిళా పోలీసు కానిస్టేబుళ్లు కూడా డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు.గణేష్ చతుర్థి సందర్భంగా భక్తులు ఉత్సాహంగా నృత్యాలు చేయడం సర్వసాధారణమైతే వారితో పాటు పోలీసులు కాలు కదపడం చూపరులను అలరించింది. నగర పోలీసు సిబ్బంది డ్యాన్సులకు నగర ప్రజలు ఈలలు వేశారు. ట్యాంక్ బండ్ వద్ద డీజే బీట్‌లకు ఓ పోలీసు అధికారి చేసిన డ్యాన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ డాన్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా గురువారం రాత్రి వరకు 40 శాతం విగ్రహాలు మాత్రమే నిమజ్జనం కావడంతో హైదరాబాద్‌లో గణేష్ ఊరేగింపు శుక్రవారం కూడా కొనసాగింది. నిమజ్జనం కోసం నగరంలో 40,000 మందికి పైగా పోలీసులను మోహరించారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా గణేష్ ఊరేగింపు సందర్భంగా పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Also Read: Adani : అదానీ.. జగన్.. తెర వెనక మోడీ

Exit mobile version