Site icon HashtagU Telugu

UP : విడాకులు తీసుకున్న కూతురికి బ్యాండ్ మేళంతో స్వాగతం పలికిన తండ్రి

Father Welcomes His Divorce

Father Welcomes His Divorce

ఏ తండ్రైన తన కూతురి పెళ్లిని ఎంత ఆర్భాటంగా ..వందమందికి పిలిచి వారికీ భోజనాలు పెట్టి..ఊరంతా పెళ్లి గురించి చెప్పుకునేలా చేస్తాడు..కానీ అదే తండ్రి తన కూతురు విడాకులు తీసుకుందంటే తట్టుకోలేడు..పదిమందికి తెలిస్తే ఏమనుకుంటారో అని భయపడతాడు..తన కూతురు తప్పు లేకపోయినా విడాకులు తీసుకోవద్దని కోరుకుంటాడు. కానీ ఇక్కడ ఓ తండ్రి మాత్రం అందరి తండ్రిలా కాకుండా విడాకులు తీసుకున్న కూతురికి బ్యాండ్ మేళంతో స్వాగతం పలికి వార్తల్లో నిలిచారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

కాన్పూర్‌కు చెందిన అనిల్ కుమార్ అనే ఓ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి.. విడాకులు తీసుకున్న తన 36 ఏళ్ల ఉర్విని సంతోషంగా పుట్టింటికి తీసుకెళ్లిన సంఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌గా మారింది. ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టులో ఉర్వి ఇంజనీర్‌గా పనిచేస్తోంది. 2016 లో ఉర్వికి పెళ్లి చేయగా.. ఆమె అత్తింటికి వెళ్లింది. అయితే ఉర్వి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లినప్పటి నుంచి ఆమెకు అక్కడ వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం వారు తీవ్రంగా హింసించడం మొదలుపెట్టారు. కూతురి కష్టాలు చూడలేక..విడాకులు తీసుకోవాలని కోరారు..తండ్రే ఆ మాట చెప్పడం తో విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కింది. అత్తంటివారి వేదింపులు కోర్ట్ కు తెలిపి..తాజాగా కోర్ట్ నుండి విడాకులు తీసుకుంది. కోర్ట్ విడాకులు ఇవ్వడంతో కూతురు ఇక సంతోషంగా ఉండొచ్చని సంతోషంతో బ్యాండ్ మేళంతో ఇంటికి తీసుకెళ్లాడు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Read Also : ప్రభాస్ ‘Kalki 2898 AD’ లుక్ వచ్చేసింది..అభిమానుల్లో పూనకాలే ..!!