Video Viral: కూతురి కోసం వీల్ చైర్ లో కూర్చొని డ్యాన్స్ .. గుండెల్ని పిండేస్తున్న వీడియో.?

సాధారణంగా నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని ఫన్నీ

  • Written By:
  • Updated On - April 29, 2023 / 11:13 PM IST

సాధారణంగా నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని ఫన్నీ వీడియోలు కాగా మరికొన్ని వీడియోలు కన్నీరు తెప్పిస్తూ ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు బాధ కలిగించేవిగా ఉంటాయి. టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో ప్రపంచం నలుమూలలా ఏది జరిగినా కూడా క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటుంది. దానికి తోడు స్మార్ట్ ఫోన్ ల వినియోగం పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగినా కూడా కొద్ది క్షణాల్లోనే తెలుసుకోగలుగుతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో కన్నీరు పెట్టిస్తోంది.

ఆ వీడియో నెటిజన్ ల గుండెల్ని పిండేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. చార్లెస్ పాటర్ అనే ఒక వ్యక్తి 2006లో యూఎస్ లోని వర్జీనియాలో ఒక తాగుబోతు డ్రైవర్ చార్లెస్ తో గొడవపడ్డాడు. ఆ సంఘటనలో డ్రైవర్ చార్లెస్ ను కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. దాంతో చార్లెస్ పూర్తిగా వీల్ చైర్ కి పరిమితం అయ్యాడు.

Viral

ఆ సంఘటన జరిగిన తర్వాత చార్లెస్ లో ఎటువంటి కదలికలు లేకుండా పోయాయి. అటువంటి పరిస్థితి నుంచి తన శరీరాన్ని మళ్లీ తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చార్లెస్ చాలానే కష్టపడ్డాడు. చార్లెస్ కి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. చార్లెస్ కూతురి వయసు ఆరు సంవత్సరాలు.

ఇటీవల ఆమె స్కూల్లో ఒక ఈవెంట్ జరగగా ఆ ఈవెంట్ లో చార్లెస్ పాల్గొన్నారు. అయితే అతని కూతురు తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసింది. చార్లెస్ కూతురు స్నేహితులు వారి తండ్రులతో కలిసి స్టేజిపై డ్యాన్స్ వేశారు. అయితే కదల్లేని మెదల్లెని స్థితిలో ఉన్న చార్లెస్ కూడా వీల్ చైర్ లో కూర్చుని కూతురుతో కలిసి స్టెప్పులు వేయించాడు. స్నేహితులతో పాటు ఆమె కూడా తన తండ్రి సహాయంతో డాన్స్ చేసింది. ఆ వీడియో ప్రతి ఒక్కరి మనసులను హత్తుకుంటోంది. చాలామంది ఆ వీడియోను చూసి కన్నీరు పెడుతున్న ఎమోజీలను షేర్ చేస్తున్నారు. కూతురి పట్ల తండ్రికి ఉన్న ప్రేమను చూసి మురిసిపోతున్నారు.