Site icon HashtagU Telugu

Dhoni Fans: ధోనిపై అభిమానంతో రైల్వే స్టేషన్ లోనే నిద్రించిన ఫ్యాన్స్.. చక్కర్లు కొడుతున్న వీడియో!

Dhoni Fans

Dhoni Fans

ఐపీఎల్ 2023 సీజన్ ఓ రేంజ్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠతభరితంగా సాగుతుండటంతో అభిమానులు ఐపీఎల్ బాగా అస్వాదిస్తున్నారు. ముఖ్యంగా చెన్నై జట్టు ఏ టీమ్ తో తలపడినా ఆ స్టేడియంలో ప్రేక్షకులతో కిటకిటలాడుతోంది. అందుకు కారణం ధోనినే. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు ఫైనల్ కు చేరుకోవడంతో మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఉత్సాహం కనబరుస్తున్నారు. భారీ వర్షం, ప్రతికూల వాతావరణంలోనూ ఫ్యాన్స్‌ ధోనీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. మ్యాచ్‌ కోసం సీఎస్కే అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి వచ్చారు. అయితే వర్షం అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది.  రాత్రి 11 గంటలకు వరకు వర్షం తగ్గలేదు.

దీంతో, అభిమానులంతా నిరాశగా వెనుదిరిగారు. ఈ రోజు ఫైనల్ జరగనున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి అహ్మదాబాద్ కు వచ్చిన అభిమానులు వసతి లేక రైల్వే స్టేషన్లలో నిద్రిస్తూ కనిపించారు. స్టేడియం నుంచి తెల్లవారు జామున 3 గంటలకు స్టేషన్ చేరుకొని నేలపైనే పడుకున్నారు. వారిలో చాలా మంది ఎల్లో జెర్సీలు వేసుకొని ఉన్నారు. కేవలం ధోనీ కోసమే తాము ఇంతదూరం వచ్చామని, అతని ఆట చూసిన తర్వాతే తిరిగి వెళ్తామని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Jupalli Krishnarao: మాజీ మంత్రి జూపల్లి అరెస్ట్.. నాగర్ కర్నూల్ లో ఉద్రిక్తత