Cement Garlic: ధరల ఎఫెక్ట్, మార్కెట్లోకి సిమెంట్‌తో చేసిన వెల్లుల్లి

ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి ఉదంతం మహారాష్ట్రలో వెలుగుచూసింది. మార్కెట్‌లో వెల్లుల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అకోలాలో నకిలీ వెల్లుల్లి విక్రయాల ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏకంగా సిమెంట్ తో వెల్లుల్లిని తయారు చేసి అమ్ముతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Cement Garlic

Cement Garlic

Cement Garlic: మహారాష్ట్రలోని అకోలాలో అత్యంత విచిత్రమైన మోసం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సిమెంటుతో చేసిన వెల్లుల్లిని ప్రజలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో వెల్లుల్లి ధరలు గణనీయంగా పెరగడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో కూరగాయల వ్యాపారులు నకిలీ వెల్లుల్లిని విక్రయిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా అకోలా నగరంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

బజోరియా నగర్‌లో నివసిస్తున్న పోలీసు డిపార్ట్‌మెంట్‌లో రిటైర్ అయిన సుభాష్ పాటిల్, ఒక వ్యాపారి తనకు సిమెంట్ నింపిన వెల్లుల్లిని విక్రయించాడని ఆరోపించాడు. సుభాష్ పాటిల్ భార్య ఇంటిముందుకు వచ్చిన కూరగాయలు అమ్మే వ్యక్తి నుంచి వెల్లుల్లి కొనుగోలు చేసింది. ఇంటికి వచ్చి దానిని పీల్ చేయగా ఖంగు తిన్నారు. ఎందుకంటే వెల్లుల్లి గట్టిగా ఉండటం చూసి షాక్ కు గురయ్యారు. కత్తి సహాయంతో చూడగా లోపల సిమెంటుతో చేసినట్టు కనిపించింది. వెల్లుల్లిని సిమెంటుతో తయారు చేసి దానిపై రంగులు వేసినట్లు గుర్తించారు.

ఈ నకిలీ వెల్లుల్లి తయారీకి సిమెంట్‌ను వాడినట్లు రిటైర్డ్ పోలీసు ఉద్యోగి తెలిపారు. ఇలాంటి వెల్లుల్లిని నిజమైన కూరగాయలతో కలిపి విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అకోలా నగరంలో వెల్లుల్లి ధర కిలో రూ.300 నుంచి రూ.3500 వరకు విక్రయిస్తున్నారు. అదే సమయంలో కొన్ని బ్లాక్ మార్కెటింగ్ ముఠాలు మార్కెట్‌లో చురుకుగా ఉన్నాయి. ఈ ముఠాలు పౌరులను మోసం చేస్తున్నాయి.

Also Read: DPL T20: సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌పై తూర్పు ఢిల్లీ రైడర్స్ 10 వికెట్ల తేడాతో విజయం

  Last Updated: 18 Aug 2024, 07:35 PM IST