Worlds Longest Rope Walk : సన్నటి తాడుపై 150 మీటర్ల దూరం నడిచాడు.. 185 మీటర్ల ఎత్తులో సాహసం!

Worlds Longest Rope Walk : సన్నని తాడు.. దాని వెడల్పు 2.5 సెం.మీ కంటే తక్కువ!!

  • Written By:
  • Publish Date - August 2, 2023 / 03:06 PM IST

Worlds Longest Rope Walk : సన్నని తాడు.. దాని వెడల్పు 2.5 సెం.మీ కంటే తక్కువ!!

అలాంటి తాడుపై అతగాడు 150 మీటర్ల దూరం సాహసోపేతంగా నడిచాడు..

కొంచెం అటూ.. కొంచెం ఇటూ ఊగినా అంతే  సంగతి !!

Also read :  Ambati Rambabu ఫై జనసేన సినిమా.. ‘SSS – సందులో సంబరాల శ్యాంబాబు’ టైటిల్

ఖతర్ రాజధాని దోహాలో రాఫెల్స్ దోహా, ఫెయిర్ మౌంట్ దోహా అనే రెండు లగ్జరీ హోటళ్లు ఉన్నాయి.. ఈ రెండు హోటళ్ల మధ్య 185 మీటర్ల ఎత్తులో లైట్లతో నిత్యం మెరిసే ఒక  తాడు ఉంది..ఇప్పుడు ఈ తాడు మీది నుంచే  ఎస్టోనియా దేశానికి చెందిన ప్రఖ్యాత అథ్లెట్ జాన్ రాస్ 150 మీటర్ల దూరం నడిచి కొత్త రికార్డును సృష్టించాడు.  ఈ తాడుపై నడిచిన తర్వాత జాన్ రాస్ మీడియాతో మాట్లాడుతూ..  “స్కేట్‌ బోర్డ్ కంటే బరువుగా ఉండే చెట్టు ట్రంక్‌పై స్కేటింగ్‌ చేసిన ఫీలింగ్ ను నేను ఈ తాడుపై  నడిచే సమయంలో(Worlds Longest Rope Walk) అనుభవించాను ” అని చెప్పాడు.

Also read :  Hero Tarun: పెళ్లి వార్తలపై హీరో తరుణ్ క్లారిటీ!