Ear Feelings : కర్ణ విలాపం (చెవి గోల)!

నేను మీ చెవి (Ear)ని. మేము ఇద్దరము, కవలలము కానీ మా దురదృష్టమేమిటంటే, ఇప్పటి వరకు మేము ఒకరినొకరు చూసుకోలేదు.

Published By: HashtagU Telugu Desk
Ear

Ear

Ear Feelings:

నేను మీ చెవి (Ear)ని.
మేము ఇద్దరము, కవలలము
కానీ మా దురదృష్టమేమిటంటే,
ఇప్పటి వరకు మేము
ఒకరినొకరు చూసుకోలేదు .
ఏ శాపమో తెలియదు
మేము ఎడ మొహం పెడ మొహంగా అమర్చబడ్డాము.
మా బాధ్యత కేవలము
వినడము మాత్రమే.
తిట్లు, చప్పట్లు,
మంచి, చెడు,
అన్నీ మేమ (Ear) వింటాము.

We’re Now on WhatsApp. Click to Join.

కానీ క్రమ క్రమంగా మమ్మల్ని వస్తువుల్ని వేలాడదీసే ఆధారాలుగా మార్చేశారు.
కళ్ళ జోడు బరువును మాపై మోపుతున్నారు. సమస్య కళ్లదైతే, సావు మోత మాకేమిటి?
బాల్యంలో చదువుకునేటప్పుడు
ఎవరికైనా మెదడు పని
చేయకపోతే మాస్టరు గారు
మమ్మల్నే మెలేస్తారు

యవ్వనంలో పురుషులు,
మహిళలు అందరూ
అందమైన జూకాలు,
కమ్మలు, లోలకులు
మొదలైనవి చేయించుకొని
మాపైన వేలాడదీస్తారు.
రంద్రాలు చేయడం, రక్తాలు కారడం మాకైతే,
పొగడ్తలు మాత్రము ముఖానికి.

ఇక అలంకరణ చూడండి. !
కండ్లకు కాటుక, ముఖానికి క్రీములు
పెదవులకు లిపిస్టిక్,
మరి మాపై (Ear) ఎందుకు వివక్ష?

ఎప్పుడైనా ఏ కవి అయినా
ఏ శాయరీ అయినా చెవుల గురించి ప్రశంసిస్తూ పొగిడితే చెప్పండి.
వారి దృష్టిలో కళ్ళు,
పెదవులు, చెంపలు ఇవే సర్వస్వము.

కళ్లకు బాధ కలిగితే కన్నీరు కారుస్తాయి. ముక్కుకు బాధకలిగితే చీదుతుంది, నోటికి బాధ కలిగితే అబ్బో, అయ్యో అని మొత్తుకుంటుంది. మరి మాకు బాధ కలిగితే బయటకు తెలియకుండా లొలొపలే భరించాలి.

ఇక పోతే పెన్నులు, పెన్సిళ్లు, అగ్గి పుల్లలు, సిగరెట్లు, బీడీలు, ఇలా ఎవరికి కావలసింది వారు మా మీద దాస్తుంటారు.

ఇదివరకు హెడ్ ఫోన్లని మాకు మూతలు వేసేవారు, ఇప్పుడు పైత్యం పెరిగి, ఇయర్ ఫోన్లని మాలోపలికి తోసి మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఏమండీ ఒక్కసారి మీ ముక్కుకు నోరుకు మూతవేసి చూడండి ఎం జరుగుతుందో.

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కరోనా మాయరోగం మా చావుకు వచ్చింది. ముక్కు, మూతి మూసుకోవడానికి వేసుకునే మాస్కులను కూడా మాకే తగిలిస్తున్నారు.

మేము చెవులమండీ, చెక్క కొయ్యలం కాదు, ఏది పడితే అది వ్రేలాడెయ్యడానికి.

మీకిష్టమొచ్చినట్లు కాకుండా ..మా పనికి మాత్రమే మమ్మల్ని వాడండి. చెవులే కదా అని చిన్న చూపు చూడకండి. మేం సంయమనం కోల్పోయామంటే మీరు కళ్ళు తిరిగి కింద పడతారు.

Also Read:  Demonetization: కలకలం రేపిన నోట్ల రద్దుకు ఏడేళ్లు.. నోట్ల రద్దు ఫలితం దక్కిందా..?

  Last Updated: 08 Nov 2023, 02:34 PM IST