Site icon HashtagU Telugu

Plane Crash: బీర్ తాగుతూ విమానం నడిపిన వ్యక్తి.. చివరికి అలా?

Plane Crash

Plane Crash

మద్యం సేవిస్తూ వాహనాలు నడపడం రాదు. అని పోలీసులు తరచూ చెప్పడంతో పాటు సినిమా హాల్ లలో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి కొటేషన్ ఉన్న పోస్టర్లు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మద్యం సేవిస్తూ వాహనాలను నడపడం వల్ల వారి ప్రాణాలు పోవడంతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా డేంజర్ లో పడతాయి అన్న విషయం తెలిసి కూడా చాలామంది ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంటారు. ఈ విషయంపై పోలీసులు ఎంత అవగాహన చేసినప్పటికీ మందుబాబులలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక వ్యక్తి బీరు తాగుతూ తన 11 ఏళ్ల కొడుకు చేతికి విమానం నడిపే బాధ్యతను అప్పగించాడు.

11 ఏళ్ల బాలుడికి విమానం నడిపించడానికి అనుమతి ఇవ్వడమే తప్పు, అతను తాపీగా బీరు తాగుతూ కొడుకుకి విమానం ఎలా నడపాలో చెబుతున్నాడు. బీరు తాగుతూ తాను చెప్పిన విషయాలను పూర్తిగా అర్థం చేసుకోలేని బాలుడు విమానం నడపడంలో తడబడ్డాడు. ఫలితంగా ఇద్దరు అనంత లోకాలకు వెళ్లారు. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. స్థానిక బ్రెజిల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బ్రెజిల్‌కు చెందిన గారన్‌ మైయాకు 11 ఏళ్ల ఫ్రాన్సిస్కో మైయా కొడుకు ఉన్నాడు. క్యాంపో గ్రాండేలో ఉండే తల్లి వద్ద అతడిని దింపేందుకు రొండోనియాలోని నోవా కాంక్విస్టా నుంచి ఒక ప్రైవేటు విమానంలో బయలుదేరారు. మధ్యలో విల్హేనా ఎయిర్‌పోర్టులో ఇంధనం నింపుకుని తిరిగి ప్రయాణం ప్రారంభించారు.

 

ఈ క్రమంలో తండ్రి మద్యం బీరు తాగుతూ.. కుమారుడికి విమానం ఎలా నడపాలో నేర్పిస్తున్నాడు. ఇలా నడుపుతున్న క్రమంలో విమానం ప్రమాదానికి గురై తండ్రీ కుమారుడు ఇద్దరు మృతి చెందారు. తండ్రి నిర్లక్ష్యంగా వ్యవహరించి 11 ఏళ్ల బాలుడితో విమానం నడిపించడం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని విమాన రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదం జరగడానికి ముందు విమానం ఎవరు నడిపారో తెలియాల్సి ఉందని,కేసు నమోదు చేసిన పోలీసులు చెబుతున్నారు. భర్త, కుమారుడి మరణ వార్త విన్న అనా ప్రిడోనిక్‌ తీవ్ర మనోవేదనకు గురైనట్టు అధికారులు తెలిపారు. తన భర్త, కుమారుడి అంత్యక్రియల అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు అధికారులు ప్రకటించారు.

Exit mobile version