Site icon HashtagU Telugu

DRDO Drone: పొలాల్లో కుప్పకూలిన డిఆర్డివో డ్రోన్.. అసలేం జరిగిందంటే?

Drdo Drone

Drdo Drone

తాజాగా కర్ణాటకలో రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ కు చెందిన డ్రోన్‌ కుప్పకూలింది. చిత్రదుర్గ జిల్లా హరియూర్‌ తాలుకాలోని వడ్డికెరె గ్రామంలోని పొలాల్లో ఈ డీఆర్‌డీవో డ్రోన్‌ కూలిపోయినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఆ డ్రోన్ కి సంబంధించిన ఫోటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా కూలిన డ్రోన్‌ను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి చేరుకున్నారు. చుట్టుపక్కల ఉన్న స్థానికులు మొత్తం అందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ డ్రోన్ ని చూసి కొందరు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కాగా గత కొంత కాలంగా డీఆర్‌డీవో యూఏవీల అభివృద్ధిపై పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తపస్ పేరుతో రూపొందిస్తున్న ఈ డ్రోన్‌ను తాజాగా ఆదివారం ఉదయం డీఆర్‌డీవో పరీక్షిస్తుండగా కూలిపోయినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.

 

ఈ ప్రమాదం గురించి రక్షణ శాఖకు సమాచారం అందించినట్లు వెల్లడించారు. డ్రోన్‌ కూలిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.