Site icon HashtagU Telugu

SBI Bank Servers: డౌన్ అయిన ఎస్బీఐ సర్వీసెస్.. ఆన్లైన్ సేవలలో అంతరాయం?

Sbi Bank Servers

Sbi Bank Servers

SBI Bank Servers: మామూలుగా అప్పుడప్పుడు ఆన్లైన్ సేవలలో అంతరాయం కలుగుతూ ఉంటాయి. మళ్ళీ కొన్ని గంటలలోనే తిరిగి పనిచేస్తూ ఉంటాయి. కానీ ఏప్రిల్ ఒకటి నుండి ఇప్పటి వరకు ఎస్బీఐ సర్వీసెస్ డౌన్ అవ్వటం వల్ల కస్టమర్లు బాగా ఫైర్ అవుతున్నారు. అయితే ఏప్రిల్ 1వ తేదీన ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ సేవలకు కాస్త విరామం ఇచ్చినట్లు తెలిసింది.

ఆరోజు మధ్యాహ్నం 1:30 గంటల నుండి సాయంత్రం 4:45 గంటల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అంటే వార్షిక ఖాతాల ముగింపు నేపథ్యంలో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అప్పటినుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ సేవలలో అంతరాయం కలిగినట్లు కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.

యూపీఐ లావాదేవీలు, నెట్ బ్యాంకింగ్, అధికారిక యోనో యాప్ వినియోగంలో సమస్యలు వచ్చినట్లు తెలుస్తుంది. ఔటైజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్ డిటెక్టర్ ఇండియా కూడా ఎస్బీఐ కస్టమర్లు సమస్యను ఎదుర్కొంటున్నారు అని ప్రకటించింది. ఇప్పటికే ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిసింది. మరికొంతమంది ఆదివారం నుంచి అంతకుముందు రెండు రోజుల నుంచి కూడా ఆన్లైన్ లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు.

అయితే ఇక ఇప్పటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఈ విషయం గురించి స్పందించలేదు. దీంతో కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా బాగా ఫైర్ అవుతున్నారు. మళ్లీ ఎప్పుడు సేవలను అందిస్తారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. మరి ఇప్పటికైనా కస్టమర్ల ఒత్తిడి లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి

Exit mobile version