Site icon HashtagU Telugu

Dog Helmet: రూల్ ఈజ్ రూల్.. హెల్మెట్ ధరించిన కుక్క, చక్కర్లు కొడుతున్న వీడియో!

Dog

Dog

ట్రాఫిక్స్ (Traffic) రూల్స్ పై పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, హెల్మెట్ ధరించాలని చెబుతున్నా.. చాలామంది ఐ డోన్ట్ కేర్ అంటూ రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు. కఠినమైన నిబంధనలు ఉన్నప్పటికీ, డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలనే నిబంధనను ప్రజలు పాటించని సందర్భాలు తరచుగా కనిపిస్తాయి. ఇది ప్రమాదాలకు (Accidents) దారితీస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో కచ్చితంగా ప్రతిఒక్కరికి కనువిప్పు కలిగిస్తుంది.

ట్రాఫిక్ రూల్స్ అంటే ఏంటో తెలియజేస్తుంది. ఓ వ్యక్తి తన బైక్ పై రోడ్డు వెళ్తున్న సమయంలో అందరి కళ్లు అతనిపైనే పడతాయి. కారణం అతని వెనుకాలే ఓ కుక్క కూడా ప్రయాణిస్తోంది. పెట్ డాగ్ జర్నీ చేయడమే చాలా కామన్. కానీ ఆ కుక్క హెల్మెట్ పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. బ్లాక్ లాబ్రడార్  అనే డాగ్ టూ వీలర్ పై దర్జాగా కూర్చొని హెల్మెట్ పెట్టుకొని కనిపించింది.

అయితే చాలామంది మొదట మనిషి అని అనుకున్నారు. కానీ దగ్గరకు వెళ్లాకా కుక్క (Black Dog) అని తెలియడంతో ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో  “రూల్ ఈజ్ రూల్” (Rule is Rule) అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ (Netizens). తన కుక్క భద్రత పట్ల జాగ్రత్తగా ఉన్నందుకు మనిషిని ప్రశంసించారు.

Also Read: flight Door: విమాన అత్యవసర డోరు తెరిచిన వ్యక్తి.. ఆస్పత్రి పాలైన ప్రయాణికులు