Site icon HashtagU Telugu

Dog Blood Donation : రక్తదానం చేసిన కుక్క

Dog Blood Donation

Dog Blood Donation

రక్తదానం (Blood Donation) మరొకరి జీవితానికి వెలుగు.. రక్తదానం చేయండి-ప్రాణదాతలుకండి.. అంటూ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు పలు అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు చేస్తుండడాన్ని మనం చూస్తూనే ఉంటాం. మూడు నెలలకోసారి రక్తదానం చేయడం వల్ల సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉండడంతోపాటు ప్రమాదకర పరిస్థితుల్లో మరొకరికి ప్రాణదానం చేసినవారవుతారు. రక్తం గ్రూపులు వేరైనా.. రంగు మాత్రం ఒక్కటే.. రక్తదానం ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ ప్రతి ఏడాది జూన్‌ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

చాలామంది కూడా రక్తదానం చేసేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే ఇప్పటి వరకు మనుషులు మాత్రమే రక్తదానం చేసి మనుషుల ప్రాణాలు కాపాడతారని చూసాం. విన్నాం. కానీ కుక్కలు కూడా తమ రక్తాన్ని (Dog Blood Donation) దానం చేసి మరో కుక్కకు ప్రాణం పోస్తాయని తాజాగా వెలుగులోకి వచ్చింది. మనుషుల పట్ల విశ్వాసం చూపడమే కాదు సాటి కుక్కకు సాయం చేయడంలోనూ ముందుంటానని ఓ శునకం నిరూపించింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలోని కొప్పళలో ల్యాబ్రడార్ జాతి కుక్క రక్తహీనతతో బాధపడుతోంది. దీనికి వెంటనే రక్తం ఎక్కించాల్సి ఉండటంతో డాబర్మేన్ కుక్కుల యజమానులను వైద్యులు సంప్రదించారు. భైరవ అనే ఓ కుక్క రక్తం సరిగ్గా సరిపోవడంతో దాని నుంచి 300ML సేకరించి, ల్యాబ్రడార్కు ఎక్కించారు. దీంతో అది ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Mega Hero : మెగా హీరో కథ మరో హీరో చేస్తున్నాడా..?