Site icon HashtagU Telugu

Maharashtra: కాలికి గాయమైతే సున్తీ చేసి పంపించారు

Maharashtra

Maharashtra

Maharashtra: మహారాష్ట్రలోని థానే జిల్లా షాహాపూర్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగు చూసింది. తొమ్మిదేళ్ల బాలుడి కాలుకు గాయం కాగా, ఆస్పత్రికి తీసుకెళ్తే సున్తీ చేశారు. దీంతో తల్లి దండ్రులు షాక్ అయ్యారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ “గత నెలలో తన స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు బాలుడి కాలికి గాయమైంది. జూన్ 15న షాహాపూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయితే గాయపడిన కాలుకు బదులుగా అతని ప్రైవేట్ పార్ట్‌కు వైద్యులు సున్తీ శస్త్రచికిత్స చేశారు.విషయం వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు షహాపూర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి కేసు నమోదు కానప్పటికీ, ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని పోలీసు అధికారి తెలిపారు.

ఆస్పత్రి ఆరోపణలపై ఆరోగ్య అధికారులు విచారణ జరుపుతారని జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ కైలాస్ పవార్ తెలిపారు. ఆసుపత్రికి చెందిన వైద్య అధికారి గజేంద్ర పవార్ విలేకరులతో మాట్లాడుతూ, బాలుడికి కాలికి గాయం కాకుండా, ఫిమోసిస్ (బిగుతైన ముందరి చర్మం) సమస్య కూడా గాయం ఉందని చెప్పడం ఆశ్చర్యపరుస్తుంది. అందుకే రెండు చోట్ల ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే రెండవ ఆపరేషన్ గురించి తల్లిదండ్రులకు చెప్పకపోవడం వారి తప్పిదంగా చూడొచ్చు. అయితే వైద్యులు చెప్పిన దాన్ని తల్లిదండ్రులు అంగీకరించడం లేదు.

Also Read: Staff Selection Commission Jobs : స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉద్యోగాలపై ప్రత్యేక లైవ్