ఇటీవల హాస్పటల్ (Hospital) లలో దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ చేస్తున్న సమయంలో డాక్టర్స్ (Doctors) వ్యవహరిస్తున్న తీరు వైద్య రంగానికి మచ్చగా మారుతుంది. ఆపరేషన్ తర్వాత కత్తెర్లు కడుపులో పెట్టి మరచిపోయి కుట్లు వేయడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఇదే తరహా ఘటన మరోటి వెలుగులోకి వచ్చింది.
ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం కు చెందిన సౌమ్య అనే మహిళకు 2021లో జరిగిన ప్రసవ సమయంలో ఓ నర్సింగ్ హోమ్‌లో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే ఆ ఆపరేషన్ సమయంలో సర్జరీ కోసం ఉపయోగించిన సర్జికల్ టవల్(surgical towel)ను ఆమె కడుపులో వదిలిపెట్టారు. అప్పటి నుంచే ఆమె ఆరోగ్య సమస్యలకు గురవుతూ, ఇబ్బంది పడుతుంది.
Sourav Ganguly: ఐసీసీ చైర్మన్ జై షాపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు!
ఆమె పరిస్థితి విషమించడంతో మరో ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు కడుపులో టవల్ ఉందని ధృవీకరించారు. ఈ విషయంలో తీవ్రంగా బాధపడిన సౌమ్య, జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. విచారణ తర్వాత ఫోరం వైద్యుల నిర్లక్ష్యం స్పష్టమైందని గుర్తించింది. వైద్య వైఫల్యం కారణంగా బాధితురాలికి ఆర్థిక నష్టంతో పాటు మానసిక వేదన కూడా కలిగిందని పేర్కొంది.
దీంతో నర్సింగ్ హోం యాజమాన్యం బాధ్యత వహించాలని సూచిస్తూ, రూ.1,35,533 వైద్య ఖర్చులు, వాటిపై 8% వడ్డీతో పాటు రూ.5 లక్షలు మానసిక బాధ పరిహారం, కేసు వ్యయంగా రూ.40 వేల చెల్లించాలనే తీర్పు ను వినియోగదారుల ఫోరం వెలువరించింది. ఈ తీర్పు వల్ల వైద్యంలో నిర్లక్ష్యం ఎంతగానో దుష్పరిణామాలకు దారితీస్తుందనే స్పష్టత సమాజానికి మరోసారి తెలిసి వచ్చింది.